అన్న నందమూరి రాజకీయాల్లోకి వచ్చి ఎందరికో రాజకీయ జీవితం ప్రసాదించిన సంగతి విధితమే. ఆయన తనతో పాటు కొన్ని తరాలకు సరిపడా కొత్త రాజకీయాన్ని పరిచయం చేశారు. ఇపుడు అదే తరం రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తోంది. విషయానికి వస్తే  ఎన్టీఆర్ బయో-పిక్‌ ఇపుడు ఓ సెన్సేషన్ గా ఉంది. ఆందుకో మొదటి భాగం కధానాయకుడు లో హీరోయిన్లు ఎవరు అన్నది రివీల్ అయింది. ఇపుడు రెండవ భాగం మహా నాయకుడు లో రాజకీయాల్లో అన్న గారి వెన్నటి ఉన్న వారి పాత్రల గురించిన న్యూస్ రివీల్ అవుతోంది.


నన్నపనేనిగా :


నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటును ప్రకటించినప్పుడు.. ఆ పార్టీలో చేరి.. ఆతరువాత ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన నన్నపనేని రాజకుమారి పాత్ర కోసం ఎవరిని సెలెక్ట్ చేశామన్నవిషయాన్ని  మేకర్స్ ప్రకటించారు. ఈ పాత్రలో ‘ మిర్చి ‘ మూవీ ఫేం మాధవిని సెలెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ పాత్రలో లీనమవుతున్న బాలకృష్ణ, నన్నపనేని రోల్ ధరిస్తున్న మాధవిల పై డైరెక్టర్ క్రిష్ కొన్ని సీన్స్ షూట్ చేసినట్టు తెలుస్తోంది.  నాటి మరికొందరు  రాజకీయ మహిళా నేతల రోల్స్ కోసం సెలెక్షన్స్ జోరుగా సాగుతున్నాయట. అంటే అన్న గారు రాజెకీయ జీవితంలో ముఖ్య భూమిక పోషించి ఆయన కెరీర్ మలుపులో ఉన్న వారంతా ఇపుడు మహానాయకుడు చిత్రంలో కనిపిస్తారన్న మాట.


పెరుగుతున్న ఆసక్తి :


అన్న నందమూరి రాజకీయ జీవితంలో ఎందరో కనిపిస్తారు. వారు కాంగ్రెస్  మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, కెంద్రంలో అప్పట్లో కీలకంగా ఉన్న నాయకులు, ప్రధానులు కావచ్చు,  గవర్నర్లు కావచ్చు. మరి వీరందరిని మహానాయకుడు చిత్రంలో చూసే అవకాశాన్నిడైరెక్టర్ క్రిష్ కలిగిస్తున్నారు. దీంతో ఈ మూవీపై రోజు రోజుకూ ఆసక్తి బాగా పెరిగిపోతోంది. 

ఈ మూవీలో క్రిష్ సెలెక్షన్ కూడా బాగా కుదురుతూండడంతో ఎలా తీస్తున్నారన్న ఉత్కంఠ బాగా ఎక్కువ అవుతోంది. అప్పట్లో రాజెకీయల్లొకి వచ్చినపుడు ఎన్టీఆర్ వయసు అరవై అయితే ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దిన వారంత 30 ఏళ్ళ‌ లోపు వాళ్ళే, ఇపుడు వారంతా రెండు తెలుగు రాష్ట్రాలో కీలకంగా  కూడా ఉన్నారు. మరి ఆ పాత్రలను ఎలా చూపిస్తారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: