తెలంగాణా ఎన్నికల్లో బావ, బావమరుదుల ప్రచారం ఊపందుకుంటోంది. తెలంగాణా ఎన్నికల పోలింగ్ కు ఇక ఉన్నది నాలుగు రోజులే కావటంతో చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ మహాకూటమి అభ్యర్ధులకు మద్దతుగా రోడ్డు షోలు, సభల్లో పాల్గొంటున్నారు. ఈరోజు ఒకవైపు చంద్రబాబు, మరోవైపు బాలకృష్ణ సాయంత్రం ప్రచారం చేయనున్నారు. రాజేంద్రనగర్, కుకట్ పల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. బాలకృష్ణేమో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు.

 

కుకట్ల పల్లి లో దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, పోటీలోకి అయితే దిగింది కానీ అనుకున్న స్ధాయిలో దూసుకుపోలేకపోతున్నట్లు సమాచారం. అందుకు కారణం ఆమె స్ధానికేతరురాలు కావటమే ప్రధాన కారణం. దానికితోడు కుకట్ పల్లి నియోజకవర్గంలో కాపులు, ముస్లిం, బ్రాహ్మణులు, రెడ్లు, బిసిలు, ఎస్సీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో అత్యధికులు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే. ఏపిలో చంద్రబాబు పాలనపై పై వర్గాల్లో చాలామందికి బాగా మంటుంది. ఆ కారణంగానే కుకట్ పల్లి నియోజకవర్గంలోని మామూలు జనాలు సుహాసిని అభ్యర్ధిత్వంపై పెద్ద స్పందించటం లేదు.


పార్టీ నేతల నుండి సమాచారం అందుకున్న చంద్రబాబు కుకట్ పల్లి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. పార్టీ నేతలను, మహాకూటమిలోని నేతలతో పాటు శ్రేణులను కూడా రంగంలోకి దింపుతున్నారు. అందుకనే మూడు రోజుల్లో రెండుసార్లు కుకట్ పల్లి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పనిలో పనిగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి గుప్తకు మద్దతుగా కూడా రోడ్డుషో, సభల్లో ప్రసంగించనున్నారు. మరి తన రోడ్డుషోలు, సభలతో చంద్రబాబు ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: