తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నట్టు ప్రకటించిన రోజు మొత్తం సీన్ అంతా టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అసలు నామమాత్రపు పోటీ అయినా ఇస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా మారాయి.

.


ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రత్యేకించి పత్రికల్లో ప్రకటనల విషయంలో కాంగ్రెస్ విచ్చలవిడిగా ప్రకటనలు ఇస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ పత్రికలన్నింటిలోనూ జాకెట్ యాడ్లు ఇస్తూ కుమ్మేస్తోంది.



తెలుగులోని ప్రధాన పత్రికలు 3, 4 రోజులుగా కాంగ్రెస్ పార్టీ మొదటి పేజీల్లో తన ఎన్నికల హామీలను విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. ఐతే.. ఈ పత్రికల ప్రకటనల విషయంలో మాత్రం అధికారపార్టీ ఎందుకనో వెనుకబడిపోయింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా పత్రికలకు యాడ్స్ ఇచ్చేది.


మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు.. ఇలా ఏ పథకం ప్రవేశపెట్టినా.. టీఆర్ఎస్ సర్కారు వార్షికోత్సవాల సమయంలోనూ పత్రికలు ప్రభుత్వ ప్రకటనలతో నిండిపోయేవి. కానీ ఎందుకో ఎన్నికల సమయంలో మాత్రం టీఆర్ఎస్ యాడ్లు పెద్దగా పత్రికల్లో కనిపించడం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ దూసుకుపోతుంటే.. టీఆర్ఎస్ నామమాత్రపు ప్రకటలు కూడా ఇవ్వడం లేదు. టీవీల్లో కాస్తో కూస్తో అయినా యాడ్లు కనిపిస్తున్నా పత్రికల విషయంలో ఎందుకనో జోరు కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: