ఇప్పటి తరంలోరాజకీయాల్లో ఉన్న వారు  కలకాలం ఒకే పార్టీలో ఉండడం అన్నది కష్టమైన వ్యవహారమే. పార్టీల హైకమాండు తీరూ అలాగే ఉంటోంది. ఇక  నాయకుల తీరు అలాగే ఉంది. పాలిటిక్స్ లో యూజ్ అండ్ త్రో విధానం అనుసరించడం చాలా కాలంగా అలవాటు అయిపోయింది. అందువల్ల ఎవరు ముందు త్రో చేస్తున్నారన్నదే ఇక్కడ ప్రదానం. 


ఆత్మ గౌరవం లేదా:


టీడీపీలో ఆత్మ గౌరవం లేదని ఈ రోజు జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. జనసేన ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో తాను ఆత్మగౌరవ పోరాటమే చేశానని, ఇందుకోసం బాగా నలిగిపోయానని కూడా చెప్పుకున్నారు. అక్కడ పదవులు ఉన్నా పవర్ ఉండదని కూడా మాజీ మంత్రి బాబు పేల్చేఅరు. అసలైన అధికారం అధినేతదేనని చెప్పకనే చెప్పేశారు. ఇన్ని అవమానాలు భరించడం కంటే బయటకు రావడమే ఉత్తమమని పార్టీ మారినట్లుగా ఆయన చెప్పుకున్నారు.


ప్రాతీయ పార్టీలే అంత :


నిజానికి రావెల ఇపుడు చేస్తున్నా ఈ ఆరోపణలకు ఎంత విలువ ఉందని ఆలోచించాల్సిన విషయమైనా  అసలు ప్రాంతీయ పార్టీల్లోనే ఆ తీరు ఉందంటున్నారంతా. ఎక్కడికక్కడ హై కమాండ్ దే పెత్తనమని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరూ దాదాపుగా సెంట్రలైజెడ్ పాలిట్రిక్స్ కి అలవాటు పడ్డారని, ఇది దశాబ్దాలుగా సాగుతోందని కూడా అంటున్నారు. ఓ విధంగా అభద్రతాభావం వల్ల కూడా ప్రాంతీయ పార్టీలో మరో నేతను ఎదగనివ్వరని చెబుతున్నారు. ఏది ఏమైనా రావెల పార్టీని వీడుతూ చేసిన ఈ హాట్ కామెంట్స్ టీడీపీకి షాక్ లాంటివేనని చెప్పాలి.


మరెంతమందో :


ఇక టీడీపీలో రావెల ఇపుడు బయటకు వచ్చారు. మరెంతమంది వస్తారో అన్నది కూడా హాట్ టాపిక్ గా ఉంది. టీడీపీలో అందరికీ టికెట్లు ఇవ్వడం ఎటూ సాధ్యం కాదు, దాంతో టికెట్ దక్కని వారి పార్టీ మారడం కూడా సహజం. రానున్న రోజుల్లో మరింతమంది టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో రావెల బయటకు వచ్చి తొలి వికెట్ డౌన్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఓ ఎమ్మెల్యే పార్టీని వీడడం ఇదే ఫస్ట్ టైం.


మరింత సమాచారం తెలుసుకోండి: