ఓటుకు నోటు కళ్ళారా వీక్షించిన తెలుగు వారిముందు - అదీ ఒక శాసనసభ్యుణ్ణి పార్టీ మార్పించే క్రమంలో ధారుణంగా పట్టుబడ్డ ప్రజాస్వామ్య ద్రోహి నేడు తెలంగాణా నడిగడ్డపై పిరాయింపుల గుఱించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటని అంటున్నారు కూకట్ పల్లి సాధారణ పౌరులు. జెఎన్టియు చౌరస్తాలో నిన్న జరిగిన టిడిపి & మిత్రపక్షాల  రోడ్ షో లో ఫిరాయింపు దారుల మీద చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తాడు . తెలుగుదేశంపార్టీ తరఫున నెగ్గి వేరే పార్టీలోకి ఫిరాయించిన ఫిరాయింపు దారులను ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చాడు.

 Image result for chandrababu in JNTU Roadshow

బాబెంత సిగ్గులేని వాడు? ఎంత మోసగాడు? ఇంత బరితెగించి బట్టబయలు నగ్నంగా నీతులు చెపుతున్నాడు? తను వదిలేసిన ధర్మం న్యాయం పరులు పాటించాలా?  అని అంటున్నారు అక్కడి  పండ్లవ్యాపారులు. మామూలుగా తన పార్టీ తరఫున చంద్రబాబు ప్రచారం చేసుకుని ఉంటే అది పెద్ద విషయం అయి ఉండేది కాదు. అయితే ఫిరాయింపుల అంశం మీద చంద్రబాబు నాయుడు మాట్లాడటమే కాదు, ఎదుటివాళ్ళను తప్పుపట్టటం, అత్యంత జుగుప్సాకరమని అక్కడ నిలుచున్న ఒక కాబ్  డ్రైవర్  స్పందించాడు.

 Image result for chandrababu in JNTU Roadshow

ఫిరాయింపుదారులను విమర్శిస్తూ చంద్రబాబు మాట్లాడటానికి మించిన అసహ్యకరమైన విషయం మరోటి ఉండనే ఉండదు, ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించాడు ఈ అభినవ అబద్ధాల శూర కర్ణుడు చంద్రబాబు నాయుడు. ఏకంగా ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను తన టిడిపి లోకి దగ్గరుండి జంప్ చేయించిన ప్రజాస్వామ్య ద్రోహి అంటూ విమర్శించారు ఒక ఉపాధ్యాయుడు.

Image result for chandrababu in JNTU Roadshow

నైతికతను ఇసుమంతైనా పాటించని వాడే, ఇలా నైతికత గుఱించి మాట్లాడటమా? అంటూ నోటిపై వేలేసుకున్నారు అనేకులు. కనీసం నైతికతకు కట్టుబడి వారిచేత రాజీనామా చేయించి, ఆపై చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడితే సమంజసంగాను గౌరవంగాను ఉండేదని జనం అంటున్నారు. అలాగే, చట్టానికి కట్టుబడి వాళ్ల మీద అనర్హత వేటైనా వేసి ఉంటే కొంతైనా విలువ దక్కేదని, ఈయన గారి దొంగ వేషాలు "ఓటుకు నోటు సినిమా" చూసిన నాడే మనకు తెలుసుగదా! అసలిదంతా ఎందుకు కుక్క కాటుకు చెప్పుదెబ్బగా  మన దెబ్బేంటో ఎన్నికల ఓటింగులో చూపిస్తే బాగుంటుందని, ఇలా ప్రజాభిప్రాయాన్ని జనానికి ఏమాత్రమూ తెలియకుండా మరుగు పరుస్తుంది పచ్చ మీడియా అంటున్నారు శ్రీకాకుళం నుండి వలస వచ్చిన  చిరువ్యాపారులు చర్చించుకుంటున్నారు.

 Image result for chandrababu in JNTU Roadshow

చంద్రబాబు పరువు ప్రతిష్ఠలు తిత్లి తుఫాన్ బాదితులకు ₹500/- విరాళం ఇచ్చి తమ స్వంత టివి చానల్స్ ద్వారా తన గొప్ప ఉదారత చాటుకున్న రోజే ఆయన తన అస్థిత్వం కోల్పోయారని పలువురు అనటం వినిపించింది.


రోడ్-షో ముందుగు సాగుతుండగా - ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులను ఇచ్చిన ఘనత మూటగట్టుకున్న చంద్రబాబు గురించి జనం తమ అసహ్యం ప్రదర్శించారు. ఇలాంటి నేపథ్యం కలిగిన చంద్రబాబు తెలంగాణలో మాత్రం మళ్లీ ఫిరాయింపులను తప్పుపట్టాడు. ఫిరాయింపుదార్లు తనకు ద్రోహం చేసారని వాళ్లని, చిత్తుగా ఓడించాల ని చంద్రబాబు ప్రవచించినప్పుడు జనానికి నవ్వాలో ఏడవాలో అర్ధంగాక చూపిన ఫీలింగ్స్ వివరించటానికి బాష చాలదు.

 Related image

చంద్రబాబు కుటిల కుశ్చిత స్వభావ భారతంలో ఇది ఒక నిస్సిగ్గు పర్వమని అక్కడే ఉన్న పండితురొకరన్నారు. అవకాశవాదంతో మాట్లాడటం చంద్రబాబుకు కొత్త ఏమీకాదని, ప్రతి విషయంలోనూ ఆయన తీరు అదేనని, వారికి తెలియక పోవటమే వారి ఖర్మ. ఇప్పుడువారికి బాగా అర్ధమైంది. ఈ వ్యవహరం చూసిన వారికి చంద్రబాబు   ఇక్కడ ప్రచారం చేయక పోయి ఉంటేనన్నా ఆ అమ్మాయి సుహాసినికి  కాసిని ఓట్లన్నపడి ఉండే అవని అంటూ బుగ్గలు నొక్కుకున్నారు అక్కడి ఇడ్లీ బండివాళ్ళు.


ఇప్పుడు ఫిరాయింపుదార్ల వ్యవహారంలో కూడా చంద్రబాబు తన నిస్సిగ్గుతనాన్ని తెలంగాణా భూమి మీద కూడా బయట పెట్టుకోవటం జనాన్ని ఆశ్చర్యపరచింది ఎందు కంటే ఓటు కు నోటు ప్రహసనం జరిగిందిక్కడే కాబట్టి. ఇది కాకుండా ఇంకేదైనా మాట్లాడి ఉంటే చంద్రబాబుకు కొంతైనా గౌరవం దక్కి ఉండేది. ఈయన గారి దెబ్బతో నందమూరి సుహాసిని విజయం అనుమానంలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: