ఉమ్మడి ఏపీ నుంచి ఒక సెంటిమెంట్ ఉంది. దాన్ని బీట్ చేయడం మహామహులకే సాధ్యం కాలేదు. తెలుగువారి ఐకాన్ గా ఉంటూ సునామీలా దూసుకొచ్చిన అన్న నందమూరి కి కూడా ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయడం సాధ్యపడలేదు. ఇక ఆయన గారి అల్లుడు, టీడీపీ ఉత్తరాధికారి చంద్రబాబు వల్ల కానే కాలేదు. అదే టీడీపీలో ఎదిగి తరువాత జైంట్ గా నిలిచి తెలంగాణాను గెలిచిన కేసీయార్ వల్ల ఈ ఫీట్ సాధ్యమవుతుందా.


పక్కా వ్యూహంతో  :


ఏ జాతకం తధాస్తు అందో తెలియదు కానీ కేసీయార్ ఆరు నెలల పదవీకాలాన్ని ఉంచుకుని మరీ ముందస్తు తలుపులు తట్టారు. అది సెప్టెంబర్ 6 వ తేదీ, ఎకాఎకిన అసెంబ్లీని రద్దు చేసి ఆ సాయంత్రమే 105 మంది అభ్యర్ధులను కేసీయార్ డిక్లేరు చేసి మొనగాడు అనిపించుకున్నారు. అప్పటికి టీయారెస్ కి తిరుగులేదనిపించింది. కేసీయార్ లెక్క ప్రకారం నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరగాలి. అలా అయితే ఈపాటికి టీయారెస్ మరో మారు గద్దెనెక్కేదే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున నిర్ణయం ప్రకారం డిసెంబర్ 7 కి అది జరిగింది. అంటే మూడు నెలల కాలం. సరిగ్గా ఇక్కడే కేసీయార్ వ్యూహం కాస్త తప్పింది.


అవకాశం పెరిగింది :


మూడు నెలల కాలం కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు పుంజుకునేందుకు అవకాశాన్ని ఇచ్చాయి. మరో వైపు అనూహ్యంగా కాంగ్రెస్, టీడీపీ దోస్తు, చంద్రబాబు రాహుల్ కలసి ప్రచారం చేయడం ఇవన్నీ కేసీయార్ వూహించనివే. దాంతో ముందస్తుకు వెళ్ళేటపుడు ఎంతో ఈజీగా మళ్ళీ గెలిచేస్తామనుకున్న సీన్ ఇపుడు కాస్తా మారుతోంది. ఇప్పటికైతే టీయారెస్ గట్టిగా పోరాడాల్సివస్తోంది. ఆ పార్టీ పట్ల, కేసీయార్ పట్ల జనంలో విశ్వాసం  సడలలేదు కానీ అదే సమయంలో బలమైన ఆప్షన్ కూడా ఉండడమే ఇపుడు కాస్త వణుకు పుట్టించే అంశం.


సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా :


దీనికి తోడు అన్నట్లుగా తెలుగు రాష్ట్రాలకు   ముందస్తు అచ్చిరాదన్న సెంటిమెంట్ ఉంది. 1989లో అన్న నందమూరి మూడు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయారు. ఇక 2004న చంద్రబాబు కూడా అరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేస్తే చేదు ఫలితాలు వచ్చాయి, ఇపుడు విడిపోయిన ఏపీలో కేసీయార్ అదే పని చేశారు. ఏపీ విడిపోయింది. సెంటిమెంట్ కూడా బ్రేక్ అవుతునందా.. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: