తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ టీడీపీ ప్రచారం జోరు పెంచింది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ టార్గెట్ గా ఆ పార్టీ నాయకులు ప్రచారం ఉధృతం చేసారు. ఓ వైపు బావ చంద్రబాబు.. మరోవైపు బామమరిది బాలకృష్ణ హైదరాబాద్ ను చుట్టేస్తున్నారు. ఇటీవల కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేయడం తట్టుకోలేకపోయారో ఏమో బాలయ్య కూడా కామెంట్స్ డోస్ పెంచేశారు.

. ఏకంగా కేసీఆర్ ను భల్లాల దేవుడిగా వర్ణించారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించేది భల్లాలదేవుడే అయినా ప్రజలు గుర్తు పెట్టుకునేది మాత్రం బాహుబలినే అంటూ కామెంట్ చేశారు. బాలయ్య బాహుబలి అని.. ఆయన్ను హైదరాబాద్ చరిత్ర నుంచి ఎవరూ చెరిపేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Image result for kcr vs balakrishna

అక్కడితో ఆగలేదు బాలయ్య... చంద్రబాబును దూషించే వారివి గల్లీ బుద్ధులని వెటకారం చేశారు. చంద్రబాబును హైదరాబాద్‌ చరిత్ర పుటల నుంచి తొలగించాలంటే హైటెక్‌ సిటీని, ఔటర్‌ రింగ్‌ రోడ్డును మాయం చేయాలని అలా చేసే దమ్ము ఎవరికుందని బాలయ్య ప్రశ్నించారు. దిల్లీ గల్లీలో కాళ్లు పట్టుకునే చరిత్ర ఆయనది కాదని చెప్పుకొచ్చారు.

Image result for bhallaladeva

 మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు బాలయ్య. రాజకీయ జీవితాన్ని, గుర్తింపును ఇస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచి పదవుల కోసం వేరొక పార్టీని ఆశ్రయించిన వారికి సనత్‌నగర్‌ ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బాలయ్య నేరుగా కేసీఆర్ ను భల్లాల దేవుడిగా పోల్చడం ఆసక్తిరేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: