తెలంగాణాలో పూర్తిగా పతనమై కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న పార్టీలు తమ శక్తినంతా కూడగట్టుకొని శ్వాసిస్తూ జీవితానికి పొడిగింపు పొందటానికి ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వేళ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ జాతివైరి కాంగ్రెస్ పార్టీతో అక్రమ సంబందానికి కూడా తెగబడ్డాడని అందుకే ఈ మాహాకూటమి పేరు తో పార్టీలు అన్నీ తమ సిద్ధాంతాల ను వదిలేసి జాతి సంకరానికి తెగబడి మాహాకూటమి పేరుతో సంగమించాయని తెలంగాణా ప్రజలు కూడా గుర్తించారు.  
Image result for prakash raj & TRS and KCR
ఈ సందర్భంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు, ఆయన అధినేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రముఖ నటుడు, సినీ బహుముఖ ప్రఙ్జావంతుడు ప్రకాష్ రాజ్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణా జన సమితి నేతలు తమ రాజకీయ జీవితానికి  "ఎక్స్‌టెన్షన్"  తెచ్చుకోవడానికే మహా కూటమి అనో, ప్రజాకూటమి అనో జతకట్టారని, ఈ కూటమి ప్రజల కోసం మాత్రం కాదని ఆయన అన్నారు. 
Image result for prakash raj & TRS and KCR
తెలంగాణ ఓటర్లు చైతన్యవంతులని, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణా జాతికి అత్యంత కీలకమైనవని అన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకే ఓటేయ్యాలని ఆయన పిలుపు నిచ్చారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ది అనుకున్న స్థాయిలో జరగదన్నారు. అలా ఐతే నారా చంద్రబాబు నాయుడు అదే అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ లో ఎందుకు ముందుకు పోలెదనే పరోక్ష అర్ధంలో మాట్లాడారు. తెలంగాణ గడ్డపై, ఇక్కడి ప్రజలపై కేసీఆర్‌ కు ఉన్నంత విజన్ గాని, ప్రేమ గాని మరే ఇతర రాజకీయనేతకు ఖచ్చితంగా లేదని విశ్లేషించారు. 
Image result for prakash raj & TRS and KCR
తనకు వ్యతిగతంగా, రాజకీయంగా, ఆర్ధికంగా టీఆర్‌ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, జాతీయస్థాయి కళాకారుడిగా ఉన్న తనకు తెలంగాణ ప్రాంతం ప్రజలపై ఉన్న సమగ్ర అవగాహనతోనే మాట్లాడుతున్నానని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు బలమైన ప్రత్యామ్నాయం రావాలని, అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే ప్రాంతీయ పార్టీల కూటమి బలపడాలని అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలంటే తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు చాలా అవసర మన్నారు

Image result for prakash raj & TRS and KCR

మరింత సమాచారం తెలుసుకోండి: