ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. రాజ‌కీయ వాతావ‌ర‌ణం పూర్తిగా వేడెక్కింది. పార్టీలు వేటిక‌వే వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఒక ప‌క్క అధికార టీడీపీ, మ‌రోప‌క్క‌, ఏ ప‌క్ష‌మో తెలియ‌న జ‌న‌సేన నాయకులు కూడా ప్ర‌జ‌ల్లో విహ‌రిస్తున్నారు. వారివారి ప్రాధాన్యాలు చెబుతు న్నారు. కుదిరితే.. అధికార పార్టీపైనా లేకుండా విప‌క్షం వైసీపీపైనావిమ‌ర్శలు గుప్పిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఇక‌, అధికార టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అడ్డ‌మైన పొత్తుల‌కూ తెర‌దీసింది. దీనికి ప్ర‌జాస్వామ్య అవ‌స‌ర‌మ‌ని, ప్ర‌జ‌ల కోస‌మేన‌ని చెబుతోంది. ఇక‌, అవినీతి తారాస్థాయిలో సాగిపోతోంది. నేత‌లు విదేశీ ప్ర‌యాణాలు చేస్తున్నా.. వాటి వెనుక అనేక ర‌హ‌స్యాలు ఉన్నాయ‌ని అధికారులే చెబుతున్నారు. అంతెందుకు కొంద‌రు మంత్రులు గుట్టు  చ‌ప్పుడు కాకుండా ఇటీవ‌ల దుబాయ్‌, సింగ‌పూర్ వంటి దేశాల‌కు వెళ్లి వ‌చ్చారు. అయితే, వాటి ప్రాధాన్యాలు అధికారులకే తెలియ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. 

Image result for tdp

ఇంకో ప‌క్క టీడీపీ స‌భ్య‌త్వ న‌మోదుతోనూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇక‌, జ‌న‌సేనాని విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది. వాస్త‌వానికి జనసేన స్థాపించినప్పుడు  ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పెద్ద మనిషి .. తాజాగా పోటీచేస్తానంటున్నాడు. అంతేకాదు, తనకు ముఖ్యమంత్రి సీటుపై ఆశలేదు అంటూనే.. ప్రజలను తనను సీఎం చేయాలని కోరుతున్నాడు. అంతెందుకు.. చంద్ర‌బాబు క‌న్నా కూడా సానుభూతి వ్యాఖ్య‌లు, ప్ర‌క‌ట‌నలు చేస్తున్నాడు.  పూటకో మాట మాట్లాడుతున్నాడు. ఇటీవ‌ల కాలంలో ఎందుకో జ‌గ‌న్‌పై పాత పాట‌ల‌న్నీ(పాత విమ‌ర్శ‌లు) క‌లిపి కొత్త రాగం అందుకున్నాడు. మ‌రి ఇలా వారి వారి పంథాల్లో ముందుకు వెళ్తున్న స‌మ‌యంలో వైసీపీ నుంచి కీల‌క‌మైన నాయ‌కులు ఉండి కూడా ఏ ఒక్క‌రూ ప్ర‌ముఖంగా మీడియాలో క‌నిపించ‌డం లేదు.

Related image

సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న‌లు కానీ, ఆరోప‌ణ‌లు కానీ, విమ‌ర్శ‌లుగానీ చేయ‌డం లేదు. ఉండేందుకు మాత్రం చాలా మందే ఉన్నారు. కంచుకంఠాలుగా పేరు పొందిన వైవీ సుబ్బారెడ్డి, మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, కొలుసు పార్థ‌సార‌ధి, తాజాగా పార్టీతీర్థం పుచ్చుకున్న ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, ఇటీవ‌లే పార్టీ లోకి వ‌చ్చిన మేధావి, మాజీ మంత్రి చిన్నంశెట్టి రామ‌చంద్ర‌య్య‌.. ఇక‌, పాత ఫైర్ బ్రాండ్‌లు రోజా, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటి వారు ఏ ఒక్క‌రూ కూడా నోరు విప్ప‌డం లేదు. మ‌రి ఇప్పుడు కీల‌క‌మైన త‌రుణంలో నోరు విప్పి జ‌నంలోకి రాకుండా ఇంటికో, నియోజ‌క‌వ‌ర్గానికో ప‌రిమిత‌మైతే.. పార్టీ ఏమ‌య్యేనో.. ఈ నాయ‌కులు క‌నీసం కూడా ఆలోచించ‌డం లేదు. మ‌రి ఇప్ప‌టికైనా వీరు మీడియా ముందుకు వ‌చ్చి త‌మ స‌త్తా చాటాల‌ని అంటున్నారు వైసీపీ అభిమానులు, సానుభూతి ప‌రులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: