తెలుగు జాతిపై మమకారం మాకూ ఉంది. ఎవరిని ఎలా చూసుకోవలో మాకు తెలియదా. మేము తెలుగువాళ్ళం కామా. మాకు కొత్తగా వచ్చి ఎవరో పాఠాలు చెప్పాలా, పచ్చగా బతుకుతున్న నేలపై చిచ్చు పెట్టే రాజకీయాలు చేయవద్దని టీయారెస్ అధినేత కేసీయార్ స్పష్టం చేశారు. కేవలం 13 సీట్లకు పోటీ చేస్తున్న టీడీపీ తెలంగాణాకు చేసేదేంటని అయన నిలదీశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ని గాలికి వదిలేసి తెలంగాణా మీద పడ్డారని ఘాటు కామెంట్స్ చేశారు. 


నీకో నమస్కారం బాబూ :


చంద్రబాబు నీకో నమస్కారం. మా బతుకులు మేము బతుకుతాం, నీవు పోయి ఆంధ్ర పాలన చూసుకోమంటూ కేసీయార్ సెటైర్లు వేశారు. తెలంగాణాకు వచ్చి కులం, మతం అంటూ రాజకీయాలు చేస్తే జనం తరిమికొడతారని కేసీయార్ హెచ్చరించారు. నాలుగున్నరేళ్ళ పాలనలో అంతా బాగున్నారు. వారూ వీరూ అన్న తేడా లేకుండా అందరినీ బాగా చూసుకున్న ఘనత టీయారెస్ ప్రభుత్వానిదేనని కేసీయార్ అన్నారు. ఇపుడు కొత్తగా వచ్చి కొందరు కుటిల రాజెకీయం చేస్తే తరిమికొట్టాలని కేసీయార్ పిలుపు ఇచ్చారు.


నకిలీ సర్వేలంటూ సెటైర్లు :


తెలంగాణాలో ఇక గెలవం అని తెలిసి నకిలీ సర్వేలు, డూప్లికేట్ సర్వేలు జనం మీదకు తీసుకువస్తున్నారని కేసీయార్ మండిపడ్డారు. ఈ సర్వేలకు తలా తోకా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ సర్వేలను చూసి మోసపోవద్దు, వంద సభల్లో ప్రసంగించి వచ్చిన వాడిని, మళ్ళీ టేయారెస్దే అధికారం,  హైదరాబాద్ లో కూడా జీహెచ్ ఎంసీ ఫలితాలే రిపీట్ అవుతాయని కేసీయార్ ధీమా వ్యక్తం చేసారు. అన్ని రకాలుగా తాము హైదరాబాద్ ని అభివ్రుధ్ధి చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 


హైదరాబాదీలుగా గర్వించాలి :


హైదరాబాదీలుగా అంతా గర్వపడాలని, హాయిగా జీవించాలని కేసీయార్ పిలుపు ఇచ్చారు. టీయారెస్ చేసిన అభివ్రుధ్ధి పనుల వల్ల రాజధాని నగరం చాలాముందుకుపోయింద్ని ఆయన చెప్పుకొచ్చారు. రేపటి రోజున మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు  కూడా తాము సిధ్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. మొత్తానికి కేసీయార్ హైదరబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో చేసిన తన ప్రసంగం ద్వారా బాబును బాగానే టార్గెట్ చేశారు.  పార్టీకి కూడా కొత్త జోష్ తీసుకువచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: