Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 11:31 pm IST

Menu &Sections

Search

తెలంగాణ‌లో ఆ ఎంపీ సీటు నుంచే ల‌గ‌డ‌పాటి పోటీ...!

తెలంగాణ‌లో ఆ ఎంపీ సీటు నుంచే ల‌గ‌డ‌పాటి పోటీ...!
తెలంగాణ‌లో ఆ ఎంపీ సీటు నుంచే ల‌గ‌డ‌పాటి పోటీ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరున్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా పొలిటికల్‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏదో ఒక పార్టీ తరపున పోటీ చెయ్యాలని అనుకుంటున్నట్టు స్వయంగా ప్రకటించారు. లగడపాటి ఈ ప్రకటన చేసిన వెంటనే రెండు తెలుగురాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రకంపన‌లు రేగాయి. లగడపాటి తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చెయ్యాలనుకుంటే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలే నడిచాయి. 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున వరసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో పోటీకి దూరంగా ఉన్నారు. 

andhrapradesh-telangana-elections-telangana-trs-ma

ఆ తర్వాత లగడపాటి ఏపీ సీఎం చంద్రబాబును నాలుగైదు సార్లు కలిశారు. ఆ క్రమంలోనే ఆయన పొలిటికల్‌ రీ ఎంట్రీ టీడీపీతో ఉంటుందని వచ్చే ఎన్నికల్లో ఆయన విజయవాడ నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారమూ జరిగింది. ప్రస్తుతం విజయవాడ టీడీపీ ఎంపీగా ఉన్న కేసినేని నాని అక్కడ బలంగా ఉన్నారు. విజయవాడ లోక్‌సభ సీటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండడంతో పాటు తన సీటు పరిధిలో కొన్ని కీలక ప్రాజెక్టులు మంజూరు చేయించుకోవడంలో ఆయన సక్సెస్‌ అయ్యారు. కేశినేని నానీని అక్కడ నుంచి మార్చేందుకు పార్టీలోనే ఒకరిద్దరు కీలక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. అలాగే పార్టీ సానుభూతి పరుల్లోనూ నానికి క్రేజ్‌ ఉండడంతో చంద్రబాబు ఆయన్ను మార్చే సాహసం చెయ్యకూడదన్న నిర్ణయానికి వచ్చారు. 

andhrapradesh-telangana-elections-telangana-trs-ma

లగడపాటి పదే పదే చంద్రబాబును కలవడంతో ఆయన టీడీపీ ఎంపీ సీటు ఆశించే ఇలా చేస్తున్నారన్న వార్తలు కూడా బయటకు పొక్కాయి. అయితే తాజాగా తెలంగాణలో ఎన్నికలపై స్పందించిన లగడపాటి ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది ఇండ‌డిపెండెంట్లు విజయం సాధిస్తున్నారని రోజుకు ఇద్దరు పేర్లు చప్పున ప్రకటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సైతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌ హాట్‌గా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ సైతం ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటాయన్న నిర్ణయానికి లగడపాటి వచ్చినట్టు తెలిసింది. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో చంద్రబాబుకు ప్ర‌యార్టీ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 


ఈ క్రమంలోనే చంద్రబాబు ఆశీస్సులు ఉన్నందున‌ రాజ్‌గోపాల్‌ వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరి లేదా ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్‌. ఈ క్రమంలోనే తెలంగాణలో మహాకూటమి బలపడుతోందన్న వ్యాఖ్యలను ఆయన లీక్‌ చేసినట్టు కూడా తెలుస్తోంది. లగడపాటి వ్యాఖ్యలు చెయ్యడంతో ఆయన వ్యాఖ్యలపై కొంత మంది అనుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు విమర్శలు సైతం చేస్తున్నారు. ఎన్నికల వేళ‌ కూటమికి అనుకూలంగా ట్రెండ్‌ మార్చేలా లగడపాటి మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైన లగడపాటి వ్యాఖ్యలపై ఆయన చుట్టూ ఎలాంటి రాజకీయం అల్లుకున్నా మరి ఆయన మదిలో ఏముందో తెలియాల్సి ఉంది.


andhrapradesh-telangana-elections-telangana-trs-ma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.