విజయవాడకు చెందిన వంగవీటి రాధాక్రిష్ణ వైసీపీ నుంచి దూరం అవుతున్నారా.. గత కొన్నాళ్ళుగా ప్రచారంలో ఉన్న దాన్నే నిజం చేస్తున్నారా. అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. చాన్నాళ్ళుగా వంగవీటి వైసీపీలో అసంత్రుప్తితో ఉన్నారన్నది నిజం. ఆయన అదను చూసుకుని బయటకు రావాలానుకుంటున్నారు. ఆ ముహూర్తం ఇపుడు వచ్చేసినట్లే కనిపిస్తొంది.


దాని కోసమే పట్టు:


వంగవీటి రాధ పార్టీ మారదలిస్తే ఆయనకు ఉన్న ఆప్షన్ ఇపుడు ఒక్కటే. అదే జనసేన. రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. అయితే జగన్ అక్కడ మల్లాది విష్ణుకు టికెట్ కంఫర్మ్ చేశారు. రాధను తూర్పునకు వెళ్ళమన్నారు. కాకపోతే బందరు పార్లమెంట్ నుంచి పోటీ చేయమన్నారు. కానీ రాధా ససేమిరా అంటూ వచ్చారు. ఇక ఆయన సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు టీడీపీలోకి పోదామంటే అక్కడ ఆల్రేడీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమ ఉన్నారు. దాంతో రాధాకు జనసేన మాత్రమే అవకాశంగా కనిపిస్తోంది.

అయితే ఈ విషయంలో కూడా రాధా చాలా కాలం పాటు మల్లగుల్లాలు పడ్డారు. ఆ పార్టీలోకి వెళ్తే గెలుపు అవకాశాలు ఎంతవరకూ ఉంటాయి, త్రిముఖ పోరులో విజయం వరించకపోతే మరింత ఇబ్బంది అని భావించారు. కానీ క్యాడర్, రంగా అభిమానులూ వత్తిడి మేరకు ఆయన చివరకి జనసేనకు జై అంటున్నారు.


పవనుకు మద్దతు:


ఇదిలా ఉండగా రాధా భవిష్యత్తు వ్యూహంపై అపుడే అడుగులు పడుతున్నాయి. వంగవీటి యువసేన నాయకత్వంలో జనసేనానికి మద్దతుగా పోస్టర్లు వెలిసాయి. ఇది చాలు రాధా అడుగులు ఎటువైపో చెప్పడానికి. 2014 లూ జగన్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చెసిన రాధా ఇపుడు ముచ్చటగా మూడవ పార్టీ మారుతున్నారు. అంతకు ముందు ఆయన 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలవడం రాధాకు అవసరం. లేకపోతే ఆయన రాజకీయ జీవితం దాదాపుగా ముగుస్తుందని అంటున్నారు.

 మరి రాధా ఎంచుకుంటున్న జనసేన ఆయనకు జయం అందిస్తుందా అన్నది చూడాలి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్లో బలమైన నేత మల్లాది విష్ణు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమా గట్టి క్యాండిడేట్. ఈ ఇద్దరినీ తట్టుకుని రాధా నెగ్గడం అంటే అంత సులువు కాదు. కానీ ఆయన సీటు పట్టుదల ఇపుడు పార్టీని మార్చేలా చేస్తోంది. తొందరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: