తెలంగాణలో ఎన్నికల ఈ నెల 7వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తున్న నిర్వహిస్తున్నారు.  ఇక బందోబస్తు కోసం 70 వేల మంది పోలీసు బలగాలు అవసరమని ఎలక్షన్ కమిషన్ అంచనా వేసింది. 307 కేంద్ర బలగాలు కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్నికోరారు.  ఈ 250 కేంద్ర బలగాలలో ఇప్పటికే 160 కేంద్ర పోలీస్ బలగాలు వరకు రాష్ట్రానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. 

కాగా, తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా పోలీసులే.. పోలీసులు కనిపిస్తున్నారు. పెద్ద పెద్ద గన్‌లు పట్టుకుంటూ.. బూట్ల శబ్ధం చేస్తూ.. తిరుగుతున్నారు. కేంద్రబలగాలు సైతం రాష్ట్రానికి చేరుకోవడంతో... ప్రజలంతా వీరిని చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు అన్ని జిల్లాల్లో హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలని డీజీపీని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించారు. ఈ హెలిప్యాడ్‌లు అటు రాజకీయ పార్టీలకు ఇటు ఎన్నికల నిర్వహణ అధికారులకు ఉపయోగపడతాయని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
Related image
ఎన్నికలకు ఇంకా నాలుగురోజులే మిగిలి ఉండటంతో బలగాల మోహరింపు ఊపందుకుంది. రాష్ట్రంలో 30వేలమంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండగా.. 279 కంపెనీల బలగాలు సమకూర్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఆదివారం రాత్రి మరో 195 కేంద్ర కంపెనీ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. రెండుమూడు రోజుల్లో మరో 39 కంపెనీలు వస్తాయని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అంతే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లా పరిధిలో ఒక ఎయిర్ అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇక  కర్ణాటక , తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి ఈ నెల 4న 18,860 మంది పోలీసులు రానున్నారు. డిసెంబర్ 8వ తేదీవరకు ఇక్కడ డ్యూటీ చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవలు రాకుండా..అల్లర్లు జరగకుండా జనాలను భయభ్రాంతులకు గురి కాకుండా ముందస్తుగా...9,656 లైసెన్స్ కల్గిన తుపాకులు స్వాధీనం చేసుకున్నారు . 6063 బెల్ట్ దుకాణాల్ని మూసివేశారు. 5401 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు రూ.111.56 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: