ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుధ్ధం కొనసాగుతోంది. నిన్న (ఆదివారం) అనంతపురం కవాతులో మాట్లాడిన జనసేనని పవన్ కళ్యాణ్ జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ ఘాటైన విమర్శలు చేశారు. దానికి రిటార్ట్ గా  ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రాజం బహిరంగ సభలో జగన్ పవన్ పై హాట్ కామెంట్స్ చేశారు. పవన్ పై చాలా కాలం తరువాత మళ్ళీ బాణాలు ఎక్కుపెట్టారు.


పెళ్ళిళ్ళు చేసుకోవడం మగతనమా:


పవన్ ఈ మధ్య ప్రతీ సభలో జగన్ మగతంపైన విమర్శలు చేస్తున్న సందర్భంలో దానికి కౌంటర్ గా  జగన్ పవన్ మగతనాన్ని ప్రశ్నించారు. నాలుగేళ్లకు ఓ మారు పెళ్లాలను  మార్చడం మగతనమా అని నిలదీశారు. వివాహ వ్యవస్థ పవిత్రమైనదని, పవన్ మరి పెళ్ళిళ్ల పేరుతో ఏం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. పవన్ రెండవ భార్య రేణూ దేశాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్న మాటలకు పవన్ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియా వేదికగా  వేధించిన సంగతిని కూడా జగన్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తప్పును ఎత్తి చూపిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లపై  ఇష్టానుసారంగా మాట్లాడిపిస్తారు.’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.


బాబు డైరెక్షన్లో  పవన్ యాక్షన్ :


చంద్రబాబు డైరెక్షన్లో పవన్ యాక్షన్ చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. నాలుగున్నరేళ్ళు చంద్రబాబుతో కాపురం చేసిన పవన్ ఈ రోజు బయటకు వచ్చి ఏదేదో చెబుతున్నారని జగన్ అన్నారు. బాబు అవినీతిలో పవన్ బాధ్యత లేదా అని నిలదీశారు. పవన్ కి అసలు నా గురించి ఏం తెలుసని జగన్ అన్నారు. పవన్ నేను అవినీతి చెస్తూంటే నీవు చూశావా అని సభ నుంచే జగన్ గట్టిగా అడిగారు. 


బాబువి నీతి లేని రాజకీయాలు:


నిన్నటి వరకూ కాంగ్రెస్ ని తిట్టిన చంద్రబాబు ఇపుడు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని జగన్ మండిపడ్డారు. ఈ రెండు పార్టీల మధ్యన అక్టోబర్ లొ డీల్ కుదిరిందని, నవంబర్లో పొత్తులు ఖరార్ అయ్యాయని చెప్పారు. ఇక బాబు టీయారెస్ తోనే మొదట పొత్తులకు ట్రై చేశారని అక్కడ కుదరలేదని అన్నారు. అక్కడ కనుక కుదిరితే కేసీయార్ వైపున నిలబడి మళ్ళీ కాంగ్రెస్ ని తిట్టేవారని జగన్ చెప్పుకొచ్చారు. 

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ..  విడగొట్టిన సోనియా గాంధీ అవినీతి అనకొండ.. ఈనాడు.. అందాల కొండ. నాడు గాడ్సే.. ఈ రోజు దేవత. ఆరోజు రాహుల్‌ గాంధీ వంటి మొద్దబ్బాయి కూడా దేశాన్ని పాలిస్తాడా? అని అడిగారు. ఇ‍ప్పుడు ఏమో మేధావి అంటున్నారు. వీరి రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయి అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: