కొన్ని రోజుల నుంచి జగన్ మీద పవన్ విరుచుకు పడుతున్నాడు . అయితే ఇంత వరకు ఆ వ్యాఖ్యల పట్ల జగన్ స్పదించలేదు అయితే ఎట్టకేలకు ఇప్పడూ జగన్ స్పందించాడు. అయితే ఈ సందర్భంగా పవన్ పై పలు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లకో పెళ్లి చేసుకుంటే మగతనం అవుతుందా అని పవన్ ను సూటిగా ప్రశ్నించారు జగన్. "పవన్ కల్యాణ్ మగతనం గురించి మాట్లాడుతున్నాడు. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు.

Image result for jagan padayatra

పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను ఈ పెద్దమనిషి రోడ్డు మీదకు తెచ్చాడు. నిత్యపెళ్లికొడుకులా నాలుగేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవడం మగతనమా అని అడుగుతున్నాను." రేణుదేశాయ్ ను సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వేధిస్తుంటే.. అడ్డుచెప్పకుండా మౌనంగా ఉండడం మగతనమా అని పవన్ ను ప్రశ్నించారు జగన్. ఒక ఆడపడుచును ఫ్యాన్స్, కార్యకర్తలు ఆడిపోసుకుంటుంటే.. పవన్ చోద్యం చూస్తూ కూర్చున్నారని దుయ్యబట్టారు.

Image result for pavan janasena

"ఇదే పవన్ గురించి ఆయన రెండోభార్య రేణుదేశాయ్ అన్నమాటలు మీకు చెబుతాను. రేణు దేశాయ్ తో కాపురం చేస్తుండగానే వేరే స్త్రీని గర్భిణిని చేసి, ఆ పిల్లాడ్ని పవన్ ఇంటికి తీసుకొచ్చాడని రేణుదేశాయ్ చెప్పింది. ఏకంగా టీవీల ముందు రేణుదేశాయ్ ఈ మాటచెప్పారు. రేణుదేశాయ్ ఇలా నిజాలు చెప్పినందుకు పవన్ కార్యకర్తలు ఆవిడ్ని సోషల్ మీడియాలో వేధించారు. అప్పుడు మౌనంగా ఉండడం మగతనమా పవన్?" నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. ప్రజల్ని కల్లబొల్లి మాటలతో మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ విరుచుకుపడ్డారు. పవన్ ప్రతిమాట వెనక చంద్రబాబు స్క్రీన్ ప్లే, డైరక్షన్ ఉన్నాయని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: