తెలంగాణా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, కెసియార్ కుటుంబానికి మెయిన్ టార్గెట్ గా మారిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కెసియార్ సభను అడ్డుకొమ్మని, టిఆర్ఎస్ ను బొందపెడతానని రేవంత్ చేసిన పరుష పదజాలం నేపధ్యంలో ఈరోజు తెల్లవారిజామున ఇంట్లో ఉన్న సమయంలోనే పోలీసులు అరెస్టు చేయటంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారమే పోలీసులు రేవంత్ ను అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత జడ్చర్లలోని ట్రైనింగ్ సెంటర్ కు  తరలించారు.

 

ఈరోజు కెసియార్ కొడంగల్ లో బహిరంగసభ నిర్వహించనున్నారు. కెసియార్ సభను అడ్డుకోమంటూ రేవంత్ పిలుపిచ్చారు. దాంతో రెండు రోజులుగా కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తలు తలెత్తాయి. కొడంగల్ లో పోటీ చేస్తున్న రేవంత్ ను ఎలాగైనా ఓడించాలని కెసియార్ గట్టి పట్టుదలతో ఉన్నారు. రేవంత్ ఓటమే లక్ష్యంగా కెసియార్ కొడుకు కెటియార్, మేనల్లుడు హరీష్ రావు తో పాటు మరికొందరు నేతలను కూడా ప్రధానంగా కొడంగల్ లోనే కేంద్రీకరించారు. దాంతో ప్రతీ రోజు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణమే కనబడుతోంది.

 

కెసియార్ సభను అడ్డుకునేందుకు, ఎన్నికల సమయంలో కొడంగల్ బంద్ కు పిలిపిచ్చారంటూ రేవంత్ పై స్ధానిక టిఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు రేవంత్ అరెస్టయ్యారు. ఇంట్లో ఉన్న రేవంత్ పోలీసులు వచ్చినపుడు తలుపులు తెరిచేలోగానే తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించినట్లు రేవంత్ అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే, రేవంత్ ను ఇతర నియోజకవర్గాల్లో తిరగనీయకుండా చేసేందుకే కెసియార్ అరెస్టు చేయించారంటూ కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుండగా ఇపుడు రేవంత్ అరెస్టు అవ్వటం పట్ల కాంగ్రెస్ ఆందోళనలో


మరింత సమాచారం తెలుసుకోండి: