వందకు వంద శాతం ఇది నిజం అంటూంటారు గులాబీ బాస్ కేసీయార్. ఆయన పార్టీ టీయారెస్ తెలంగాణా ఎన్నికల్లో దూసుకుపోతుందని గట్టి ధీమాతో ఉన్నారు. లగడపాటి సర్వేలను సైతం పక్కన పెట్టిన కేసీయార్ తన సర్వేలను జనం ముందుకు తెస్తున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసమే తిరిగి గెలిపిస్తుందని, బంపర్ మెజారిటీతో అధికారం ఖాయమని చెబుతున్నారు.


చెప్పినట్లుగానే:


కేసీయార్ చెప్పినట్లుగానే ఓ సర్వే ఉంది. ఇపుడు తెలంగాణాలో వివిధ పార్టీల జయాపజయాలపై నిర్వహిచిన ఆ సర్వే టీయారెస్ కి కీలక సమయంలో బూస్టింగ్ ఇచ్చేలాగానే ఉంది.  దాదాపు 100 సీట్లతో టీఆర్ ఎస్ సర్కారు అధికారంలోకి రాబోతుందని ఓ సర్వే స్పష్టం చేసింది. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ చేసిన సర్వే ప్రకారం టీఆర్ ఎస్ పార్టీ సీట్ల సంఖ్య 100కు పైగా దాటింది. టీఆర్ ఎస్ పార్టీకి 94 నుంచి 104 వస్తాయని ఆ సర్వే తెలిపింది. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి 16 నుంచి 21 సీట్లకే పరిమితం కానున్నట్లు పేర్కొంది. ఎంఐఎం పార్టీకి 7 సీట్లు - బీజేపీకి 1 నుంచి రెండు సీట్లు - ఇతరులు ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.


ఎదురులేదా :


నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ 119 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అభ్యర్థి - పార్టీని లెక్కలోకి తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ చేశారు. సీపీఎస్ మొత్తం 286567 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. 2009 అసెంబ్లీ ఎన్నికలు - గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ సీపీఎస్ ఇచ్చిన ఫలితాలు నూటికి నూరుశాతం నిజమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఆర్ ఎస్ పార్టీ దూసుకుపోతుంది. టీఆర్ ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎదురు లేదని సర్వే తేల్చి చెప్పింది. 
ఈ పరిణామాలతో గులాబీదళంలో ఆనందం వెల్లి విరుస్తూండగా, ప్రత్యర్ధి శిబిరం సర్వేలోని పాయింట్లు ఎంతవరకూ నిజమన్న దానిపై తర్జన భర్జన పడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: