ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎంత ముందుకు సాగినా..మూఢ విశ్వాసాలకు మనిషి ఇంకా దాసోహం అంటూనే ఉన్నారు.  భగవంతున్ని ఎంత భక్తితో పూజిస్తారో..క్షుద్ర శక్తులకు అంతగా వణికి పోతారు.   అంతే కాదు ఎదుటి వారిని ఓడించాలన్నా..చంపాలన్న నేరుగా కాకుండా చేతబడి, బాణామతి ఇలా క్షుద్ర పూజలు చేయిస్తే తాము అనుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.  ఇలాంటి అమాయకుల మూఢ విశ్వాసలు కొంత మంది బురుడీ బాబాలు బాగా క్యాష్ చేసుకుంటారు. 

తాజాగా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో గుడ్లగూబలకు ఉపద్రవం ముంచుకు వచ్చింది.  పురాణాల్లో గుడ్ల గూభలకు ఎంతో శక్తి ఉందని..వాటిని క్షుద్ర పూజలకు ఉపయోగించేవారని..వాటికి చాలా పవర్ ఉంటుందని కొంత మంది దొంగ బాబాలు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.   గుడ్లగూబలను చంపి వాటిని ప్రత్యర్థుల నివాస స్థలాల్లో పడేస్తే ఇక తమ గెలుపును ఎవరూ ఆపలేరని విశ్వసిస్తున్న అభ్యర్థులు ఎంత డబ్బైనా ఇచ్చి కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యారు. 

ఇంకేముందీ గుడ్ల గూభలు ఎక్కడ కనిపిస్తే వాటిని వేటాడటానికి బయలు దేరారు కొంత మది దుర్మార్గులు. దాంతో ఒక్కసారిగా వాటికి గిరాకీ ఏర్పడింది. ఒక్కో గుడ్లగూబకు మూడు నుంచి నాలుగు లక్షలు ఇచ్చేందుకు సైతం అభ్యర్థులు ముందుకు వస్తుండడం గమనార్హం.తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో గుడ్లగూబల కోసం వేట జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం సేడంలో ఆరుగురు వ్యక్తులు గుడ్లగూబలను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వీటిని విక్రయిస్తున్నట్టు విచారణలో వారు వెల్లడించారు.

మేలు రకమైన గుడ్ల గూభలకు  డిమాండ్‌ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు.  ఇలాంటి రూమర్లు జనాల్లోకి తీసుకు వెళ్లి అమాయ పక్షులను దారుణంగా చంపడం పై  పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లగూబలను వేటాడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: