టీఆరెస్ నేత కేసీఆర్‌ వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజవర్గంలోని కోస్గిలో నేడు (మంగళవారం) నిర్వహించనున్న బహిరంగసభలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగ కుండా ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. 
Image result for revanth arrest
నేటి తెల్లవారు జామున 3 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్‌ రెడ్డి తో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిగి వద్ద వాచ్‌మెన్‌ ను వదిలివెళ్లారు. ఆ తరువాత రేవంత్‌ రెడ్డిని షాద్-నగర్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. 

కాగా పోలీసుల తీరుపై రేవంత్‌ రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్తను ఉగ్రవాదిని తీసుకెళ్లినట్లు బలవంతంగా తీసుకెళ్లారని, తమ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఓటు తో బుద్ధి చెప్పాలని గీత కోరారు. మరోవైపు  కేసీఆర్‌ బహిరంగ సభ నేపథ్యంలో కొడంగల్‌ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో 144సెక్షన్‌ అమలవుతోంది. 
Image result for revanth arrest
కాంగ్రెస్ లో కేసీఆర్ తనకు ఏకైక ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డిని తాను భావిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే కేసీఆర్ ను లక్ష్యం చేస్తూ  విమర్శలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఆ నియోజకవర్గంలోని కోస్గిలో కేసీఆర్ సభ జరుగుతుండటంతో ఏం జరుగుతుందా? అని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పైగా సభకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ తీస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఈసీ సీరియస్ గా పరిగణించిన విషయం తెలిసిందే. దీంతో కొడంగల్ కోస్గీ పరిసర ప్రాంతాల్లో గొడవలేమీ జరగకుండా పోలీసు అధికారులు 144 సెక్షన్ విధించారు.

Image result for revanth arrest

తెల్లారుగట్ల 3 గంటలకు రేవంత్ ఇంట్లోకి గేటు పగలగొట్టి పోలీసులు ఒకేసారి వందమందికి పైగా ప్రవేశించారని. రేవంత్ ను సోదరుడు కొండల్ రెడ్డిని పలువురు ప్రధాన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ ను మొదట జడ్చర్ల ట్రైనింగ్ సెంటర్కు ఆ తర్వాత షాద్ నగర్ పోలీస్ స్టేషనుకు తరలించినట్టుగా తెలుస్తోంది. రేవంత్ అరెస్ట్ తో కొడంగల్లో ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. రేవంత్ సభను అడ్డుకునే ఆలోచన చేయడంవల్లే అరెస్టు చేయాల్సి వచ్చిందన్నది పోలీసుల వాదన.

Image result for revanth reddy family

పోలీసుల తీరుపై రేవంత్ భార్య గీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచకానికి పరాకాష్ట. రేవంత్ ఏమైనా ఉగ్రవాదా? పోలీసులు తలుపు విరగ గొట్టి ఇంటి లోపలకి రావాల్సిన అవసరం ఏముంది?


ఇంట్లో ఉన్న వ్యక్తికి భద్రత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే ఊరుకోమని ఆమె మండి పడ్డారు. ఇది కక్షసాధింపు అని ఆమె వ్యాఖ్యానించింది. ఎపుడూ ఒకటే ప్రభుత్వాలు ఉండవు. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలి అని ఆమె అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: