చంద్రబాబునాయుడుపై వైసిపి ఎంపి విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఖర్చు చేయటానికి చంద్రబాబు రూ 15 వేల కోట్లను రెడీ చేసినట్లు చెప్పారు. ఆ డబ్బు మొత్తాన్ని చంద్రబాబు నియోజకవర్గాలకు పంపేశారట. ఆ డబ్బంతా ఎవరెవరి దగ్గరుంది ? ఎవరెవరి దగ్గర ఎంతెంత దాచిపెట్టింది కూడా తమకు తెలుసంటూ ఎంపి పెద్ద బాంబే పేల్చారు. నాలుగున్నరేళ్ళ అవినీతి పాలనలో దోచుకున్న రూ 4 లక్షల కోట్లలో ఇపుడు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణా, రాజస్దాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఖర్చు చేస్తున్నట్లు మండిపడ్డారు.

 Image result for polavaram project images

రాజస్ధాన్, మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణాలో కాంగ్రెస్, మహాకూటమి అభ్యర్ధుల ఎన్నికల ఖర్చంతా చంద్రబాబే చూసుకుంటున్నట్లు ఆరోపించారు. తెలంగాణాలో రూ 1200 కోట్లు, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో రూ 500 కోట్లు చంద్రబాబే ఖర్చు చేసినట్లు మండిపడ్డారు. 2019లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు రూ 5 వేల కోట్లు ఖర్చు  చేస్తానని రాహూల్ గాంధికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు విజయసాయి చెప్పటం విడ్డూరంగా ఉంది. రాహూల్, చంద్రబాబు మధ్య జరిగిన ఆర్ధిక ఒప్పందాలు విజయసాయికి ఎలా తెలిసింది ? అయితే ఒక విషయం మాత్రం నిజమే. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి లేదు. దాంతో ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటోందన్నది వాస్తవం. ఇటువంటి సమయంలో చంద్రబాబుతో పొత్తన్నది కాంగ్రెస్ కు బాగా కలిసివచ్చేదనటంలో సందేహం లేదు.

Image result for chandrababu and rahul gandhi

వివిధ పథకాల్లో, వివిధ ప్రాజెక్టుల్లో చంద్రబాబు దోచుకన్న రూ 4 లక్షల కోట్లలోనే చంద్రబాబు ఎన్నికల్లో ఖర్చులు పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు దోచుకున్నదంతా ప్రజాధనమే కాబట్టి చంద్రబాబు ఏ రూపంలో ఇచ్చినా పుచ్చుకోవటంలో తప్పే లేదన్నారు. ప్రతీ పథకం, ప్రతీ ప్రాజెక్టులో చంద్రబాబు ఏకంగా 40 శాతం కమీషన్లు దండుకుంటున్నట్లు విజయసాయి ఆరోపించారు. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయ కల్లం ఈ మధ్యనే మాట్లాడుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రూ 20 వేల కోట్లకు పైగా దోపిడి జరిగిందని ఆరోపించారు. దోపిడి జరిగిందంటే అధికారంలో ఉన్న వారికే కదా అవకాశం ? కాబట్టి విజయసాయి చెప్పినదాంట్లో కొంత నిజమే అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: