కే ఏ పాల్.. ఈయన సంగతి తెలియని వారు అరుదు. ఓ మత బోధకుడిగా కంటే.. సోషల్ మీడియా కమెడియన్ గా ఆయన ప్రాచుర్యం పొందారు. ప్రపంచంలోని వందల కొద్దీ దేశాల్లో శాంతి సందేశం వినిపించానని.. అనేక దేశాల అధ్యక్షులతో పరిచయాలున్నాయని.. పలువురు దేశాధ్యక్షులు తన ఆశీస్సులు తీసుకుంటారని ఆయన చెబుతుంటారు. వీటిలో చాలావరకూ నిజం కూడా.



వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన సేవా సంస్థ పీస్ ఇనిషియేటివ్ కు విదేశీ విరాళాలు రాకుండా చేశారని..అప్పటి నుంచి ఆయన ప్రభ తగ్గిందని చెబుతారు. గత ఎన్నికల సమయంలోనే ఆయన ప్రజాశాంతి అనే పార్టీని స్థాపించారు. వచ్చే ఆంధ్రా ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలోనూ పోటీ చేయాలని భావిస్తున్న ఆయన మళ్లీ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారు.



అందులో భాగంగా సోమవారం మోజో టీవీ చానల్ కు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే యాంకర్లు పదే పదే అడిగిన ప్రశ్నలే అడగటం పాల్ కు చిరాకు తెప్పించింది. అంతే కాకుండా.. ఓ ప్రశ్న అడిగాక దాని సమాధానం చెబుతుండగానే మరో ప్రశ్న అడగటం వంటి చర్యలతో పాల్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో లైవ్ లోనే ఆయన యాంకర్లపై చిర్రుబుర్రులాడారు.

ఓ దశలో సహనం కోల్పోయిన పాల్ మీరు.. ఇంటర్వ్యూ ఎలా చేయాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నన్ను ఇంటర్వ్యూకు పిలవండి అంటూ చిరాకు పడ్డారు. అంతే కాదు.. మీదో చిన్న చానెల్.. అయినా కూడా మీరు పిలవగానే వచ్చాను. చాలా చిన్న చానల్ అయినా గంటసేపు మీ ఆఫీసుకు వచ్చి ఎదురుచూశాను.. మీ ఇంటర్వ్యూ తీరేంబాగాలేదు అంటూ లైవ్ లోనే అసహనం వెలిబుచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఆసాంతం ఇలా కే ఏ పాల్ యాంకర్లపై సెటైర్లు వేస్తూనే ఆడుకున్నారు. మొత్తానికి మరోసారి కే ఏ పాల్ టీవీ ఛానళ్లకు లాఫింగ్ స్టాక్ అవుతున్నారు. ఇటీవలే టీవీ 99 ఈయన్ను ఇంటర్వ్యూ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: