కొడంగల్ నియోజకవర్గం లో కెసిఆర్ సభను అడ్డుకోవాలని గతంలో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నివ్వడంతో..తాజాగా కెసిఆర్ సభ జరగబోతున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని ముందస్తుగా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో కొడంగల్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Image result for revanth reddy

రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు రేవంత్ రెడ్డి అనుచరులు రావడంతో కొడంగల్ లో హై టెన్షన్ నెలకొంది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి భార్య తన భర్తను పోలీసులు ఏక్కడకు తీసుకెళ్లారు అన్న విషయం గురించి తనకు తెలియదని..తెల్లవారుజామున ఒక ఉగ్రవాదిని తీసుకెళ్లినట్లు తన భర్త రేవంత్ రెడ్డిని తీసుకెళ్లారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి భార్య గీత.

Image result for revanth reddy

దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొడంగల్ నియోజకవర్గం లో జరిగిన పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి భార్య గీత కి ఫోన్ చేయడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయం లో రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది.మరోపక్క కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి భార్యకి ఫోన్ చేసి అన్ని విధాల ఆదుకుంటామని తెలియజేసినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: