చంద్రబాబు నాయుడి చాణక్యంతోనే కర్ణాటక రాష్ట్రంలో జేడిఎస్ ప్రభుత్వ ప్రతిష్టాపన దిగ్విజయంగా జరిగిందని మొత్తం తెలుగు సమాచార వ్యవస్థ కోడై కూసింది. అంతే కాదు చంద్రబాబు కూడా కర్ణాటకలో బిజెపి వైఫల్యానికి తామే కారణమని తెగేసి చెప్పారు కూడా! అంతే కాదు దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేఖ శక్తుల ఏకీకరణ తన లక్ష్యమని కూడా చెప్పారు. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి ఆంధ్రులకు తలలేని మొండి ఆంధ్ర ప్రదేశ్ ను కట్టబెట్టినా కాంగ్రెస్ తో - అదీ ఆవిర్భావం నుండి టిడిపి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో జట్టుగట్టి - ఆయన మరో ప్రధాన శత్రువు - ఓటుకు నోటు కేసుతో తెలంగాణా నుండి బిచాణా ఎత్తుకొని రాత్రికి రాత్రి పారిపోయేలా చేసిన టీఆరెస్ దాని అధినేత కెసీఆర్ ను ఓడించటానికి చతురంగ బలాలను అంటే టిడిపి-కాంగ్రెస్-టిజేఎస్-సిపీఐ లను ఏకంచేసి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేసి మొహరించిన కార్య కారకుడు చంద్రబాబేనన్నది జగమెరిగిన సత్యం. 
Related image
అంతే కాదు ఈ ఐఖ్యసంఘటన అదే ప్రజాకూటమికి ఆర్ధిక వ్యూహ రాజకీయ సహాయం చేసేది కూడా చంద్రబాబే నన్నది అందరికీ తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో పరోక్షంగా పట్టు సాధించేందుకు అంటే కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ముఖ్యనాయకులను  హైదరాబాద్‌లో మోహరించారు. 
Related image
ప్రజాకూటమి నుండి టీడీపీ పోటీ చేసే అన్నీ స్థానాలతో పాటు కాంగ్రెస్‌ పోటీ చేసే అన్నీ నియోజకవర్గాలకు కూడా తెలుగుదేశం బలగాలను తరలించారు. 40మంది ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు, ఎంపీలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఏపీలోని ప్రతిజిల్లా నుంచి సుమారు 50–60మంది ముఖ్యనేతలను కూడా హైదరాబాద్‌ కు తరలించారు. వీరు కాకుండా వివిధశాఖల అధికారులు, పోలీసు అధికారులు సుమారు 200 మందిని తెలంగాణా పంపించారు. మొత్తంగా ఆంధ్ర ప్ప్రదేశ్ నుండి వెయ్యిమందిని భిన్న బృందాలుగా విభజించి తెలంగాణలోని ఎంపిక చేసిన నియోజకవర్గాలకు పంపించారు. వీరందరికి కూకట్‌పల్లి లోని లాడ్జీల్లో బస ఏర్పాట్లు చేశారు. 
Image result for praja kutami in telangana
కొద్దిరోజుల ముందే వీరందరికీ గుంటూరుజిల్లా మంగళగిరిలోని హ్యాపీక్లబ్‌ లో శిక్షణ ఇచ్చినట్లు గుంటూరుకు చెందిన ఒక ఎమ్మెల్యే తెలిపారు. శిక్షణసమయంలో నంద్యాల ఉపఎన్నికలో అవలంబించిన విధానాన్ని వివరించి, తెలంగాణ ఎన్నికలలో గెలుపుకోసం ఏంచేయాలో నేర్పించినట్లు, తెలిపారు. శిక్షణ తీసుకున్న వెయ్యిమంది మాత్రమే కాకుండా టీఆరెస్ వైఫల్యానికి  ప్రచారవ్యూహంతో మరో రెండు వేల మందిని నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఆయా నియోజకవర్గాలకు ముందు గానే పంపించారు మరోవైపు నాయకులంతా తమకు పట్టున్న ఏదో ఒక తెలంగాణా నియోజకవర్గంలో కనీసం రెండు రోజులు విరామం లేకుండా పనిచేయాలని ఆదేశాలు అందినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడు తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. 
Image result for praja kutami in telangana
ఇదిలా ఉంటే టీడీపీ దివంగత నేత నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీచేస్తున్నందున ఆ నియోజకవర్గంపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గ బాధ్యతను పయ్యావుల కేశవ్‌ కు అప్పగించారట. ఇక్కడున్న 380 బూత్‌ లకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేసే దిశగా టిడిపి ముఖ్యనేతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో టీడీపీ పోటీచేస్తున్న ముఖ్యమైన ఏడు నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ర 
Related image
ఇదిలా ఉంటే.. ఉదయం వేళల్లో తమకు అప్పగించిన ప్రాంతంలో తమ సామాజికవర్గం ఓటర్లను కలుసుకుంటున్న వీరు.. రాత్రివేళల్లో తమకు కేటాయించిన అభ్యర్థుల కు ఆర్థిక సహకారం అందించడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, టీఆర్‌ఎస్‌లో కీలకంగా పనిచేసే నాయకులు, బూత్‌స్థాయి కార్యకర్తలను లొంగదీసు కోవడం మీడియా మేనేజ్మెంట్‌ వంటి వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. కాగా, టీడీపీ కుయుక్తులను టీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ఆధారాలతో సహా ఎన్నికల సంఘం ముందుంచేందుకు సిద్ధమయ్యారు. 
    

మరింత సమాచారం తెలుసుకోండి: