తెలంగాణా ఎన్నికలు కాదు కానీ ఏపీలో హై బీపీని పెంచుతున్నాయి. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుదు అక్కడ రాజకీయంగా
చురుకుగా వ్యవహరించడంతో పాటు కొన్ని సీట్లకు పోటీ పెట్టడంతో ఏపీలోని విపక్షాలకు కూడా నోటి నిండా పని తగులుతోంది. ఇక చంద్రబాబు తెలంగాణా వ్యూహాలలో ఇపుడు బిజీగా ఉంటే ఆయన వెంట నీడలా ఏపీ విపక్షాలు వెంటాడుతున్నాయి.


1200 కోట్లట:


తెలంగాణా ఎన్నికల్లో పారుతోదంతా చంద్రబాబు డబ్బేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాబు ఏపీలో అక్రమంగా సంపాదించిన సొమ్మును తెలంగాణాకు తరలిస్తున్నారని విరుచుకుపడ్డారు. బాబుకు ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేయడం అలవాటేనని, నంద్యాల ప్రయోగాన్ని అక్కడ కూడా అమలు చేస్తున్నారని అన్నారు. 
ప్రతి అసెంబ్లీ సీటుకు 10 కోట్లు వంతున ఎకంగా 1200 కోట్ల రూపాయలు సొమ్ము బాబు ఖర్చు పెట్టి కాంగ్రెస్ గెలుపునకు క్రుషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికలు జరుగుతున్న  ఉత్తరాధి రాష్ట్రాలకు సైతం బాబు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కి ఫండింగ్ ఇచ్చారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వీటన్నిటి మీద తాను తొందరలో పూర్తి వివరాలు చెబుతానని కూడా ఆయన‌ పేర్కొన్నారు.


ఏపీలో భారీ అవినీతి :


ఇదిలా ఉండగా ఏపీలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని విజయసాయిరెడ్డి విమర్శించారు. దాదాపుగా నాలుగు లక్షల కోట్ల అవినీతి నాలుగున్నరేళ్ళ పాలనలో జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమేయాలని చెప్పిన చంద్రబాబు ఇపుడు నెత్తిన పెట్టుకోవడం ఏంటని నిలదీశారు. 2014 ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని మాట్లాడిన బాబు ఇపుడు పిల్ల కాంగ్రెస్ టీడీపీని చేశారని అన్నారు. 

సోనియా గాంధీ ఇపుడు దేవతగా బాబుకు కనిపించడంలో ఆశ్చర్యం లేదని, బాబు అవినీతిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ పంచన చేరారని అన్నారు. ఏపీలో జనసేనాని రూటు కూడా మెల్లగా టీడీపీ వైపుగా మళ్ళుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన బాబు డైరెక్షన్లోనే యాక్ట్ చేస్తున్నారని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: