Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 9:10 am IST

Menu &Sections

Search

కేసీఆర్ కు సరైనోడు రేవంత్..! అందుకే అంత భయమా..?

కేసీఆర్ కు సరైనోడు రేవంత్..! అందుకే అంత భయమా..?
కేసీఆర్ కు సరైనోడు రేవంత్..! అందుకే అంత భయమా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ ఎన్నికల రణక్షేత్రం చివరి అంకానికి చేరుకుంది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తులు వేయడంలో రాజకీయ పార్టీలన్నీ నిమగ్నమై ఉన్నాయి. కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రజా కూటమి విశ్వప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ కూడా కీలక నేతలను టార్గెట్ గా చేసుకుని ముందుకెళ్తోంది.  రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్. కేసీఆర్ కు కొరకరాని కొయ్యలా మారారు. గతంలో టీడీపీలో ఉన్నా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినా రేవంత్ టార్గెట్ మాత్రం కేసీఆరే..!! కేసీఆర్ పై నేరుగా టార్గెట్ చేయడంలో రేవంత్ ముందుంటారు. కేసీఆర్ పని పట్టాలంటే రేవంత్ ఒక్కడే సరైనోడు అనే పేరు తెచ్చుకున్నారు. దీంతో కేసీఆర్ అండ్ కో కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే పనిచేస్తోంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో వర్కవుట్ చేస్తోంది.

telangana-elections-assembly-elections-2018-trs-kc

కొడంగల్ రేవంత్ రెడ్డి కంచుకోట.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రేవంత్ రెడ్డికి ఇక్కడ తిరుగులేదు. ఈ సారి కూడా రేవంత్ కు ఇక్కడ తిరుగులేదనే ప్రచారం జరుగుతోంది. గతంలో కంటే ఈసారి మరింత ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డికి ముఖ్య పదవి ఖాయమనే అంచనాల్లో కొడంగల్ ప్రజలు, రేవంత్ అభిమానులు ఉన్నారు. దీంతో రేవంత్ కు భారీ మెజారిటీ కట్టబెట్టాలనే లక్ష్యంతో రేవంత్ శ్రేణులు పనిచేస్తున్నాయి.  అయితే టీఆర్ఎస్ మాత్రం రేవంత్ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందుకోసం భారీ స్కెచ్ వేసింది. కేటీఆర్, హరీష్ రావులకు ఈ బాధ్యతలను అప్పగించారు కేసీఆర్. ఇప్పటికే రెండు విడతలుగా వీళ్లద్దరూ అక్కడ ప్రచారం చేశారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఇవాళ ప్రచారానికి వెళ్తున్నారు. అయితే కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలు పోలీసులను, ఎన్నికల అధికారులను కంగారు పెట్టించాయి. దీంతో రేవంత్ ను తెల్లవారుజామున అరెస్ట్ చేసి అజ్ఞాత ప్రదేశానికి తరలించారు.

telangana-elections-assembly-elections-2018-trs-kc

తెలంగాణలో రేవంత్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు ఓ సంచలనం. పోటీలో నిలిచిన అభ్యర్థిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. భయానక వాతావరణం సృష్టించి అరెస్ట్ చేయడానికి ఆయనేమైనా టెర్రరిస్టా అని రేవంత్ భార్య, కుమార్తె ప్రశ్నిస్తున్నరు. రేవంత్ అరెస్టును చట్టపరంగా ఎదుర్కొనేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు రేవంత్ భార్య గీత పార్టీ శ్రేణులను, రేవంత్ అనుచరులనుసంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కేసీఆర్ కుట్రలను ఓటుతో ఎదుర్కోవాలని, రేవంత్ ను భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.

telangana-elections-assembly-elections-2018-trs-kc

కేసీఆర్ సభను అడ్డుకుంటామన్నందుకే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారా.. లేకుంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కేసీఆర్ మీటింగ్ కారణమైతే మీటింగ్ తర్వాత రేవంత్ ను విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల బరిలో నిలిచిన వ్యక్తిని పోలింగ్ కు ముందు అరెస్ట్ చేసి అజ్ఞాతంలో ఉంచితే రాంగ్ సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉంది. రేవంత్ ను ఎదుర్కోలేకే కేసీఆర్ ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేయించారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ఇది మరింత సింపతీ తీసుకొచ్చే అవకాశం ఉంది.


telangana-elections-assembly-elections-2018-trs-kc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.