రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. అయితే రేవంత్ ను ఎక్కడికి తీసుకెళ్లారనేది ఇప్పటివరకు తెలియదు . అయితే తమ అభిమాన నాయకుణ్ని వెంటనే విడుదల చేయకపోతే ప్రాణాలు తీసుకునేందుకూ వెనకాడబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చిరిస్తున్నారు. మరోవైపు - రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి నేతలు రేవంత్ అరెస్టును తప్పుపడుతున్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందంటూ ఆరోపిస్తున్నారు.

Image result for revanth reddy arrest

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమయంలో కొడంగల్లో ఎన్నికల నిర్వహణ సరికాదని ఈసీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొడంగల్లో ఎన్నికను వాయిదా వేసే అవకాశాలను వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలా ఉద్రిక్తతలు నెలకొన్న నియోజకవర్గాల్లో ఎన్నిక వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి.

Image result for revanth reddy arrest

దీంతో కొడంగల్లోనూ ఎన్నికల వాయిదా తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు - రేవంత్ రెడ్డి ఎక్కడున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఆయన్ను మహబూబ్ నగర్కు తరలించినట్లు చెబుతున్నప్పటికీ.. అందులో నిజమెంతో నిర్ధారణ కాలేదు. రేవంత్ ఆచూకీ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు హైకోర్టుకు పోలీసులు చెప్పే సమాధానంపైనే ఉంది. రేవంత్ను ఎక్కడ ఉంచారో చెప్పాలంటూ ఆయన భార్య గీత వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణను మంగళవారం ఉదయం నిలదీయడం కూడా సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: