టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు రేవంత్ కోట – కొడంగల్ లో అడుగు పెట్టారు. కేసీఆర్ సభను అడ్డుకుంటామంటూ రేవంత్ హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధించారు. కేసీఆర్ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయన్ను జడ్చర్లకు తరలించారు. హైకోర్టు మొట్టికాయల నేపథ్యంలో రేవంత్ ను పోలీసులు విడుదల చేయక తప్పలేదు.. ఈలోపే కేసీఆర్ కొడంగల్ లో అడుగుపెట్టి సభ కూడా కంప్లీట్ చేసేశారు.. రేవంత్ కోట కొడంగల్ లో అడుగు పెట్టాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు.
Image result for revanth reddy
ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. కోస్గిలో జరిగిన ఈ సభ హరీష్ రావు నేతృత్వంలో జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ సభలో కేసీఆర్ తన పాలనలో చేపట్టిన పథకాలను గుర్తు చేశారు. ఓటు వేసేటప్పుడు ఓసారి ఆలోచించి ఓటేయాలన్నారు. కాంగ్రెస్ – టీడీపీ కూటమి దశాబ్దాలుగా పాలించాయని.. వారి వల్ల ఒరిగేదేమీ ఉండదని సూచించారు. తెలంగాణలో అభివృద్ధి ఇప్పుడే పట్టాలెక్కిందని.. ఈసారి గెలిపించడం ద్వారా దాన్ని పరుగులు పెట్టిస్తామని చెప్పుకొచ్చారు.


ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఈసారి టీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నట్టు కేసీఆర్ చెప్పారు. తనకు పక్కా సమాచారం ఉందని, తప్పకుండా అన్ని స్థానాలను కారు గుర్తు కైవసం చేసుకోబోతోందని చెచ్పారు. గతంలోలాగా కాకుండా పాలమూరు జిల్లా ప్రజలు చైతన్య వంతులయ్యారని చెప్పారు. అందుకే అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామనే నమ్మకం తనకు కలిగిందన్నారు..ఈ నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు రెట్టింపు పనులు వచ్చే పాలనలో చేపట్టబోతున్నట్టు కేసీఆర్ చెప్పారు. అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరొందిన పాలమూరు మహర్దశ పట్టబోతోందని కేసీఆర్ వివరించారు. గతంలో కరెంటు ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఓసారి బేరీజు వేసుకోవాలని సూచించారు.

గతంలో తెలంగాణకు అడ్డుపడ్డ నేతలందరూ ఈరోజూ మీ ముందుకొచ్చి ఓట్లడుగుతున్నారని, అలాంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చంద్రబాబును నెత్తన పెట్టుకుని వస్తున్న కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలన్నారు.  కోస్గీలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ సభలో కేసీఆర్ ఎక్కడా రేవంత్ పేరు కూడా ప్రస్తావించలేదు.. తాను చేసిన అభివృద్ధి పనులను మాత్రమే చెప్పుకొచ్చారు. తానేం చేయబోయేదీ చెప్పారు. రేవంత్ ను విడుదల చేయాలని హైకోర్టు అదేశించడం, వెంటనే రేవంత్ ను విడుదల చేయడం.. ఆయన కొడంగల్ బయల్దేరడం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో కొడంగల్ సభను కేసీఆర్ ముగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: