ఆంధ్రా ఆక్టోపస్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తన తాజా సర్వే వివరాలు మీడియాతో పంచుకున్నారు. వాస్తవానికి ఆయన పూర్తి ఫలితాలను పోలింగ్ రోజు సాయంత్రం వెల్లడిస్తానని ఇదివరకే ప్రకటించారు. కానీ ఆ లోపు తెలంగాణలో గెలవనున్న ఇండిపెండెంట్ల వివరాలు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంథర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి. వినోద్ గెలుస్తారని ప్రకటించారు.



ఐతే.. పూర్తి ఫలితాలను లగడపాటి ప్రకటించకపోయినా చూచాయగా ఆయన తెలంగాణలోని తాజా పరిస్థితిని తన సర్వే ద్వారా వివరించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ప్రజాకూటమిదే అధికారం అని ఆయన చెప్పకనే చెప్పేశారు. పోలింగ్ శాతం పెరిగితే కాంగ్రెస్ కూటమికి విజయావకాశాలు పెరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. పోలింగ్ శాతం తగ్గితే హంగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు లగడపాటి.

Image result for mahakutami 2018


ఇక జిల్లాలవారీగా లగడపాటి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఖమ్మం, అదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యంలో ఉందని రాజగోపాల్ చెప్పారు.



ఇక టీఆర్ఎస్ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆధిక్యం కనబరుస్తుందని లగడపాటి చెప్పారుమరో రెండు జిల్లాల్లో ప్రజాకూటమి, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఎంఐఎం ఎక్కువగా సీట్లు గెలుచుకుంటుందని లగడపాటి తెలిపారు. అంతే కాదు.. బీజేపీకి గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పడం విశేషo


మరింత సమాచారం తెలుసుకోండి: