ఎన్ని సర్వేలు వచ్చిన లగటిపాటి సర్వే వస్తే ఆ కిక్కే వేరు ఎందుకంటే జాతీయ చానెల్స్ వదిలిన సర్వేలను కూడా ఎవరు పట్టించుకోరు కానీ లగటిపాటి  సర్వే అంటే చాలు జనాల్లో అదో నమ్మకం అయి పోయింది . అయితే లగటిపాటి  వదిలిన సర్వే ఇప్పడూ అంత నమ్మకంగా లేదని అనిపిస్తుంది. గత ఎన్నికలంత శాతం ఓట్ల పోల్ అయితేనే తన జోస్యం ఫలిస్తుందట. లేకపోతే లేదట. ఏమన్నా అర్థం వుందా? పోలింగ్ శాతం పక్కాగా అంతే వుంటుందనడానికి ఎక్కడయినా ఆస్కారం, లాజిక్ వుందా? ఇదంతా గోడమీద పిల్లి వాటం మాదిరిగా, అన్యాపదేశంగా కేసిఆర్ అండ్ కో విజయానికి ఎదురు ఈదుతున్నారని చెప్పడం తప్ప వేరు కాదు కదా?

Image result for lagadapati raj gopal reddy

సరే, లగడపాటి ముచ్చట పక్కన పెడదాం.  ఇప్పుడు ఈ సర్వే చెబుతున్నది ఏమిటి? తెలంగాణలో స్వీప్ అనేది రావడం లేదు అని. అంతే కదా? స్వీప్ అనేది రాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కష్టసాధ్యం. ఎందుకంటే, కూటమి లో ఇప్పటికే చేరాల్సిన పార్టీలు చేరిపోయాయి. కొత్తగా చేరేవి లేవు. భాజపా ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించదు. మజ్లిస్ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించేసింది. ఆ రెండింటికి 15 సీట్లు వచ్చినా చాలు. ఓ నలభై సీట్లు టీఆర్ఎస్ కు వచ్చి గట్టెక్కిపోవడానికి. మరీ ఈ చిన్న లాజిక్ లగటిపాటి కి కనిపించలేదా..!

లగడపాటి సన్నాయి నొక్కులు

ఇదే భయం వుంది లగడపాటికి కావచ్చు, ఆంధ్ర తరపున మనసులో వకాల్తా తీసుకునే బిజినెస్ సర్వేయర్లకు కావచ్చు. అందుకే గట్టిగా మాట్లాడడం లేదు. మళ్లీ లగడపాటి లాంటి వాళ్లు హైదరాబాద్ లో వ్యాపారాలు సాగించాలి కదా? మామూలు జనాలకు కేసిఆర్ కు ఓటు వేసినా, వేయకున్నా పంచాయతీ లేదు. ఈ బడా బాబులకే సమస్య. అందుకే గట్టిగా మాట్లాడకుండా, సన్నాయి నొక్కులు నొక్కుతూ, కూటమి విజయం కోసం తాము చేయగలిగింది చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: