గత నెల అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకు పోయింది.  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఎలాగైనా మట్టి కరిపించాలని నిశ్చయంతో టీ కాంగ్రెస్, టీటిడిపి,టీజేఎస్, సిపీఐ మహాకూటమిగా ఏర్పడింది.  గత నెల ప్రచారాలు మందకొడిగా సాగాయి..కూటమిలో సీట్ల సర్థుబాటుకి చాలా ఆలస్యం అయ్యింది.  మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ తర్వాత మహాకూటమి ప్రచారం జోరు కొనసాగించింది.  సోనియా, రాహూల్ గాంధి రంగంలోకి దిగారు..ఇక ఏపి సీఎం చంద్రబాబు సైతం మహాకూటమికి మద్దతుగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

రాహూల్ గాంధీ, చంద్రబాబు కలిసి ప్రచారం కొనసాగించడంతో మహాకూటమిలో ఉత్సాహం నెలకొంది.  మరోవైపు బాలకృష్ణ తన సోదరుడు దివంగత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కోసం కుకట్ పల్లిలో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.  మరోవైపు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అలుపెరుగకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు.  ఇక తెలంగాణలో నేటితో మైకులు మూగబోనున్నాయి. సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది.
Image result for telangana all parties
ఏడో తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం నేటి సాయంత్రం ఐదు గంటలతో పార్టీలన్నీ తమ ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఏడో తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం నేటి సాయంత్రం ఐదు గంటలతో పార్టీలన్నీ తమ ప్రచారాన్ని  నిలిపివేయాల్సి ఉంటుంది.  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

Image result for rahul gandhi chandrababu telangana

 ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఏపీ సీఎం చంద్రబాబు, రాహుల్ జంటగా ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే, కోదాడలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముథోల్ బీజేపీ అభ్యర్థి రమాదేవికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: