అఖిల భారత కాంగ్రెస్ కమిటి జాతీయ ప్రధన కార్యదర్శి, రాహూల్ కోటరిలో అత్యంత ముఖ్యుడైన గులాంనబీ ఆజాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలను గమినించిన వారికి  అవే అనుమానాలు మొదలవుతున్నాయి. కొడంగల్ ల్లో రేవంత్ ఇంటికి వెళ్ళిన ఆజాద్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ముందు కెసియార్ పై మండిపడ్డారు. తర్వాత పదవుల్లో ఉన్న వారు ఎలా నడుచుకోవాలో సుద్దులు చెప్పారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలతోనే పార్టీలో కలకలం మొదలైంది. ఇంతకీ ఆజాద్ చివరలో ఏం చెప్పారంటే ? ‘ఈరోజు సిఎం కుర్చీలో కెసియార్ ఉన్నారు..రేపు ఆ కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చోవచ్చు’ అని అన్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది.

 Image result for chandrababu naidu and revanth

సరే కాంగ్రెస్ పార్టీలో సిఎం కుర్చీ కోసం ఎగబడని నేతలు ఎవరూ ఉండరు. సీనియారిటీ, సమర్ధత అన్నది కాంగ్రెస్ పార్టీలో పెద్ద ముఖ్యంకాదన్న విషయం అందిరికీ తెలిసిందే. సమైక్య రాష్ట్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత సిఎంగా ఎవరైనా అయిపోవచ్చనే ధైర్యం అందరిలోను వచ్చేసింది. దానికితోడు ఇప్పటి సిఎం కెసియార్ పనితీరు చూసిన తర్వాత ముఖ్యమంత్రి పదవంటే అందరిలోను మరీ పలచనైపోయింది. ఇది వరకూ సిఎంలుగా పనిచేసిన వారంతా సమర్ధులైనా కాకపోయినా కనీసం ప్రతీ రోజు సచివాలయం కన్నా వచ్చి అందరికీ అందుబాటులో ఉండేవారు. కెసియార్ వ్యవహారశైలి చూసిన తర్వాత సిఎం పదవంటే ఉండే వాల్యు పూర్తిగా పోయిందనే చెప్పాలి.

 

ఇక ప్రస్తుతానికి వస్తే నెక్ట్స్ సిఎం రేవంత్ రెడ్డే కావచ్చన్న ఆజాద్  వ్యాఖ్యలతో పార్టీలో పెద్ద కలకలమే మొదలైంది. రేవంత్ అరెస్టు, రిలీజ్ తర్వాత నేతల్లోను, శ్రేణుల్లోను హుషారు పుట్టించటానికి ఆజాద్ ఏదో యదాలాపంగా ఆ వ్యాఖ్యలు చేసుంటారని అనుకునేందుకు లేదు. ఆజాద్ మామూలు నేత కాదు. చాలా సీనియర్  పైగా రాహూల్ కోటరిలో ముఖ్యమైన నేత. అటువంటి నేత సిఎం పోస్టు విషయంలో బహిరంగంగా రేవంత్ పేరు బయటపెట్టారంటే దాని వెనుక ఏమైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయ. ఆజాద్ ప్రకటన వెనుక చంద్రబాబునాయుడు ప్లాన్ ఉండొచ్చన్న అనుమానాలకు ఊతమిస్తోంది.

 Image result for uttam kumar reddy

రేపటి ఎన్నకల్లో మహాకూటమి గనుక అధికారంలోకి వస్తే చంద్రబాబు అయితే రేవంత్ నే సిఎంగా ప్రతిపాదిస్తారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ లేకసోతే సీనియర్ నేతలు బట్టి విక్రమార్క, విహెచ్, గీతారెడ్డి లాంటి వాళ్ళు ఎవరూ చంద్రబాబు చాయిస్ కారు. ఎందుకంటే, వాళ్ళపై చంద్రబాబుకు ఎటువంటి ప్రేమా లేదు. ఏదో తెలంగాణాలో కాలు మోపటానికి కాంగ్రెస్ ను చంద్రబాబు వాడుకున్నారంతే. కాంగ్రెస్ తో కలిస్తే టిఆర్ఎస్ ను దెబ్బకొట్టచ్చన్న అంచనాకు వచ్చిన తర్వాతే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసారు. నిజానికి ఎలక్షనీరింగ్ లో ప్రస్తుతం ఉన్న నేతలెవరూ చంద్రబాబు ముందు ఎందుకూ పనికిరారన్న విషయం అందరికీ తెలిసిందే. తన ముందు ఎందుకు పనికిరాని వారిని నెత్తిన పెట్టుకుని మోయటానికి చంద్రబాబేమన్నా పిచ్చోడా ? అందుకే తన మనిషైన రేవంత్ ను ముందుగా కాంగ్రెస్ లోకి పంపారు. తర్వాత రేవంత్ ను ముందుపెట్టుకునే రాజకీయం మొదలుపెట్టారు.

 Related image

రేపటి రోజున మహాకూటమి అధికారంలోకి వస్తే, కొడంగల్లో గిలిస్తే రేవంతే సిఎం అయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు రేవంత్ ను ముందుపెట్టుకుని తెరవెనుక నుండి చంద్రబాబే చక్రం తిప్పుతారు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ఏపిలో తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చేది అనుమానమే. అందుకనే చంద్రబాబు ముందుజాగ్రత్త పడుతున్నారు. ఏపిలో ఓడిపోతే చంద్రబాబు వచ్చి హైదరాబాద్ లో కూర్చుని చక్రం తిప్పుతారే కానీ  నోట్లో వేలేసుకుని చూస్తూ కూర్చునే రకం కాదు. దీర్ఘదృష్టితో ఆలోంచిబట్టే కాంగ్రెస్ తో పొత్తులపై ఇంటా బయటా ఎవరెన్ని అమ్మనాబూతులు తిడుతున్నా భరిస్తున్నారంటే ఏదో పరమార్ధం లేనిదే చంద్రబాబు అన్నింటినీ భరిస్తున్నారంటారా ? వందల కోట్ల రూపాయలు కుమ్మరిస్తారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: