ఆ బుడ్డోడి వయస్సు కేవలం ఏడేళ్లు. ఆ వయస్సులో పిల్లలు ఏంచేస్తుంటారు.. సాధారణంగా ఫస్ట్ క్లాసో, సెకండ్ క్లాసో చదువుతుంటారు. ఇంట్లో నానా అల్లరీ చేస్తుంటారు. కానీ ఓ బుడ్డోడు అదే వయస్సులో కోట్లు సంపాదిస్తున్నాడు. ఏడాదిలో ఏకంగా 155 కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఎలాగంటారా.. కేవలం ఆడుకోవడం ద్వారా..



ఆడుకోవడం ద్వారా డబ్బు ఎలా సంపాదించాడంటారా.. ఆ చిన్నోడు మార్కెట్లోకి వచ్చిన కొత్త బొమ్మలన్నీ కొంటాడు.. వాటితో ఆడుకుంటాడు.. కేవలం ఆడుకుంటే డబ్బులెలా వస్తాయంటారా.. ఏం లేదు. ఆ బుడ్డోడు ఆడుకునేదంతా వాళ్ల అమ్మానాన్నా వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టేస్తారు. అంతే..



అవును మరి రేయాన్ అనే ఈ బుడ్డోడు యూట్యూబ్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. రేయాన్ టాయ్స్ రివ్యూ పేరుతో ఉన్న ఈ చానల్ లో కొత్త వీడియో పోస్ట్ చేయడం ఆలస్యం.. లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి. ఈ వీడియోలు చూసేదంతా కూడా బాలలే కావడం విశేషం.



అలా యూట్యూబ్ లో ప్రకటన ద్వారా ఈ ఏడాది 155కోట్లు సంపాదించాడు. అంతేకాదు.. ఈ ఏడాదిలో యూ ట్యూబ్ ద్వారా ఎక్కువ ఆదాయం అందుకుంది ఈ చిన్నోడేనట. అలా ఏకంగా ఈ చిన్నోడు 2017 ఫోర్బ్స్ జాబితాలోనూ చోటు సంపాదించాడు.



అందుకే అంటారు ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని. మరి అందరినీ ఆకట్టుకునే కొత్త కాన్సెప్ట్ ఉంటే మీరూ ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలు సంపాదించొచ్చు మరి. ట్రై చేస్తారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: