చంద్రబాబు ఏంటి.. విజయ్ దేవరకొండను ఫాలో అవ్వడం ఏంటీ అనుకుంటున్నారా.. ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన విజయ్ దేవరకొండ సినిమా గీత గోవిందం చూశారా.. అందులో విజయ్ దేవరకొండ మంచివాడే అయినా.. ఓ చిన్న తప్పు కారణంగా.. హీరోయిన్ రష్మిక ముందు వంగి వంగి సలాములు పెడుతుంటాడు.

Image result for geetha govindam


హీరోయిన్ రష్మికను ప్రేమించిన విజయ్ దేవరకొండ.. ఆమె ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తాడు.. ఎంత ఏడిపించినా సహిస్తాడు.. ఇదంతా ఆమె ప్రేమ కోసమే. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అంతే.. ఆయన కూడా తెలంగాణ ప్రజల ప్రేమలో పడ్డాడు. తెలంగాణకు మంచి పరిపాలన అందించడం కోసం ఏమైనా చేస్తానంటున్నాడు.



అందుకే కేసీఆర్ అండ్ కంపెనీ చంద్రబాబును ఎన్ని తిట్లు తిట్టినా భరిస్తానంటున్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో నొక్కి వక్కానిస్తున్నాడు. కేసీఆర్ రోజు నన్ను రోజూ బూతులు తిడుతున్నాడు. అయినా నేను పట్టించుకోను. ఆ తిట్లన్నీ మీకోసం భరిస్తాను.. మీ కోసమే నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకుంటున్నాడు.


అందుకే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న చంద్రబాబు మాటలు చూస్తుంటే అచ్చం గీతగోవిందంలోని విజయ్ దేవర కొండ గుర్తుకు వస్తున్నాడు. గీత గోవిందం సినిమా రష్మిక వేధింపులన్నీ సహించిన విజయ్ చివరకు ఆమె ప్రేమను సంపాదించాడు. మరి చివరకు చంద్రబాబు తెలంగాణ ప్రజల మనసు చూరగొంటాడా.. చంద్రబాబు సానుభూతి అస్త్రం ఫలిస్తుందా.. ఈ విషయం డిసెంబర్ 11న కానీ తెలియదు. వెయిట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి: