"ఈన గాచిన పంట వాన పాలయిన విధం" గా ఉంది తెలంగాణాలో నేటి పరిస్థితులు. ప్రజలు తెలంగాణా ఉద్యమ నేతను నమ్మి 2014ఎన్నికల్లో కేసీఆర్ కు విజయం కట్టబెట్టారు. దరిమిలా అధికారం తన గుప్పిట్లోకి రాగానే కెసీఆర్ దాన్ని తన కుటుంబానికి పంచిపెట్టారు. ఒకే కుటుంబం నుండి మంత్రి మండలిలో ముగ్గురు చేరిపోవటం నాలుగవ వ్యక్తి దేశ రాజధానిలో ఉంటూ ఇక్కడి ప్రభుత్వానికి రక్షణగా కాపుగాస్తూ ఉండం జరిగింది. ఐదవ వ్యక్తిని కూడా కేసీఆర్ రాజకీయంలోకి తీసుకు రావటంతో పంచపాండవుల్లా ఒకే కుటుంబం నుండి తెలంగాణాను పరిపాలించటం మొదలెట్టారు. చివరకు హోం మినిస్టర్ కు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే గట్స్ లేవని ప్రజలంతా చెప్పుకుంటునారు. ఎక్కడ చూసినా ఈ మాటలే వినిపిస్తున్నాయి.
Image result for kcr harish kavita ktr santosh rao
కుటుంబ ప్రాధమ్య రాజకీయాలు ఏవిధంగా చూసినా రాజవంశాల రాజకీయాలకు అంటే డైనాస్టీ పాలిటిక్స్ ఏవిధంగాను తీసిపోవు. అంటే మనం బానిసల్లా ఒక కుటుంబ నిర్ణయాలకు బద్దులమై బ్రతకాల్సి వస్తుంది. అలా చూసినప్పుడు దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కుటుంబ లేదా వ్యక్తి ఆద్వర్యంలో నడిచేవే.

ఇంకా విశాలంగా పరిశీలిస్తే నారా చంద్ర బాబు నాయుడు కూడా దానికి అతీతుడుకాదు. ఆయన ముఖ్యమంత్రి కుమారుడు పంచాయతీ రాజ్ మరియు ఐటి శాఖా మంత్రి. బావమరది బాలకృష్ణ ఒక రాజ్యాంగేతర శక్తి. పాలనలో ఎంత నికృష్ట అంటే వినోదపన్ను కూడా బాలకృష్ణ సినిమాకే చేశారు గాని అదే గ్రౌండ్స్   పై తెలుగువారి చరిత్ర తో తీసిన తెలంగాణా రుద్రమ దేవి సినిమాకు వినోదపన్ను రద్ధు చేయలేదంటే చాలు ఆ రాష్ట్ర పాలనలో ఎవరు ప్రయోజం పొందుతున్నారో తెలవటానికి. 

Image result for harish rao & santosh rao
అలాంటి ఇరువురు వ్యక్తులను శాశ్వితంగా రాజకీయాలకు దూరం చేసినప్పుడే తెలంగాణా ప్రజలు తమ విఙ్జత నిరూపించుకుణ్ణట్లు ఔతుందని రాజకీయ విశ్లేషకుల భావన. దేశం మొత్తం ఒక భావన గా ఉండాలి. ఉన్నత వర్గాలు ఎలాగో విఫణి వ్యాపార లతో ప్రయోజనాలను పొందుతున్నారు. లేకుంటే వారికి లాబీయింగ్ ఉండనే ఉంది. అల్ప - స్వల్ప ఆదాయవర్గాలకు అన్నీ రాజకీయ పక్షాలు ఒకరిని మించి మరొకరు సంక్షేమ ప్రయోజనాలను అందిస్తూనే ఉన్నారు. ఎన్నో ఉచితాలు-కొన్ని సబ్సిడీలు-మరికొన్ని అంతర్జాతీయ సంస్థల సహకారం. 

అయితే ఏవరికి ఏమి చెయాలన్నా రాష్ట్రాలకు కేంద్రానికి వనరులు పన్నుకట్టే వారు మాత్రమే ఇందులో ఎక్కువ సంఖ్యలో ఉండేది మద్యతరగతి వారే. వీళ్ళని పాలనలో కనికరించేదెవరూ లేరు. అందుకే నగరాల్లో పట్టణాల్లోని మధ్యతరగతి జనమంతా ఓట్లేసి ఈ కుటుంబ పాలకులను ఉభయ తెలుగురాష్ట్రాల నుండి ఓడిస్తే మనకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. సంక్షేమం అంటూ కేకలు వేసే వారు నిజంగా సోమరిపోతులను తయారు చేస్తున్నారు. ప్రజలప్పుడు ఉచితంగా వచ్చిన సొమ్ముతో కొనుక్కున్న మందు ఉచిత వినోదం కింద మగువతొ(స్వత భార్యే కావచ్చు)విలాసంగా సంతానోత్పత్తి చేస్తూ మానవ వనరులను నిష్ప్రయోజనం గావిస్తున్నారు. 

Image result for chandrababu naidu family images
కుటుంబపాలనలో స్వకుటుమబ ఆధిపత్యం, అవినీతి, కులప్రీతి, బంధుప్రేమ ఇవి పెరిపోయి జాతి నిర్వీర్యమౌతుంది. అందుకే మన ఇద్దరు చంద్రులకు గ్రహణం పట్తిస్తే సరి. ఇక కాంగ్రెస్ నూరేళ్ళ కుటుంబ పాలనకు ప్రపంచ స్థాయి ఉదాహరణగా చెప్పవచ్చు. అంతే కాదు ప్రజల బానిసత్వ భావనకు ఇది పరాకాష్ట. నేడు ప్రజలు సరిగా ఆలోచించి ఓటెయ్యవలసిన అగత్యముంది. ప్రజా కూటమి విషయానికి వస్తే అటు కాంగ్రెస్ టిడిపి రాజకీయాలను ముచ్చటించటం జరిగింది. సిపీఐ వయసు దాదాపు కాంగ్రెస్ వయసంత. అయినా దేశంపై ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. మిగిలింది కోదండ రాం నాయకత్వంలో తెలంగాణా జనసమితి ది విచిత్ర పరిస్థితి. పూర్తిగా నాయకత్వ లోపమే కనిపిస్తుంది.
Image result for jawaharlal indira rajiv rahul sonia
కోరి కొట్లాడి నీల్లు, నిధులు, నియామకాలు అంటూ కాలం గడిపి టీఆరెస్ ఓటమే ప్రధానంగా పోరాడటం దానికి ప్రత్యామ్నాయంగా టిడిపి ఉన్న ప్రజా కూటమిలోకి చేరి పోవటం అంత పెద్ద తప్పు ఇంకోటి లేదు. రాష్ట్ర విభజనకు మూలకారణం టిడిపి అందులో ప్రధాన కారణం దాని అధినేత నారా చన్ ద్రబాబు నయుడు కుటుమ స్వార్ధం. ఇప్పుడు టిజేఎస్ కోరుకున్నట్లు  కాంగ్రెస్ గెలిస్తే జరిగేది తెలంగాణాను చంద్రబాబు చేతికి బంగారు పళ్ళెం లోపెట్టి అప్పనంగా అందించటం మాత్రమే. 
Image result for gautamiputra ku Tax exemption in AP why not rudrama
Related imageఇప్పుడు పరిశీలంచండి చంద్రబాబు తన మామగారి కుటుంబం "నదమూరి" వారింటి అమ్మయిపై కురిపించే ప్రేమ చూడండి అది చాలు - మనకర్ధమౌతుంది ఆయన ప్రేమ మొదట తన కుటుంబం ఆతరవాత తన బందుగణం ఇంకా ఆపై కులజనం. ముఖ్య స్థానాల్లో తన కుల పరిజనాన్ని పోటీలో నిలిపి-ఆంధ్ర ప్రజలను 'సెటీల్ర్శ్ అన్న పేరుతో విడగొట్టి వాల్లను తన బందువులకు, తనకులం వారికే ఓట్లేయమటున్నారు. ఇక ప్రజాకూటమి అధికారంలోకి వస్తే పాలన మొత్తం ఏపి బాబు చేతిలో పడి మనకు బ్రిటీష్ వారి తరహా పాలన వస్తుంది.  
Image result for TJS Kodandaram
అంతే రాష్ట్రంలో ఉన్న అనేక అంతర్జాతీయ కంపెనీలు కార్పోరేట్లు అమరావతి దారిపట్టొచ్చని హైదరాబాద్ ప్రయోజనాలు అటకెక్కి నగరం నిర్వీర్యం ఔతుందన్నది నిజం. గట్టిగా చెప్పాలంటే సెటిలర్స్ అనేవాళ్ళే లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ కు తరలి వచ్చినవారే. అది గుర్తించి హైదరాబాద్-తెలంగాణాలో పుట్టి పెరిగి చదుకొని ఉద్యోగమో వృత్తో అవలంబించిన వారెవరూ సెటిలర్ కాడు. విభజనే తప్పు. ఇప్పుడు దాయాదులకు పాలన ఇస్తే అంతకంటే దరిద్రం ఇంకటి ఉండదు.
Image result for future CM devansh & KTR son

మనం కుటుంబాలకు రాజకీయాలను ఇచ్చెస్తే మన భవిష్యత్ ముఖ్యమంత్రులు వీరే 


అందుకే టిఆరెస్, టిడిపి, కాంగ్రెస్, టిజేఎస్, సిపీఐ పార్టీలను వదిలేసి మనకు మనరాష్ట్రానికి మనదేశానికి మేలుచేయగలన్నపార్టీకి, లెదా కనీసం వ్యక్తికి  ఓటేస్తే మంచి దని పలువు విఙ్జుల వాదన. అప్పుడు కులం తదితర న్యూసెన్సుల ఉనికే ఉండదు. ఇద్దరు చంద్రుల బెడద తో పాటు దేశాన్ని ఏడుద శాబ్ధాలు గా పాలించినా ఒక ప్రక్క కాస్మీర్, మరోప్రక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత కాశ్మీర్, ఇంకో ప్రక్క పాకిస్తాన్, దేశం చుట్టూ చైనా సమస్యలు ఇంకా పెంచుకోవటం తప్ప దేశానికి ఇంకేమీ ఉండవు. 

Related image

ఇదీ అసమర్ధ కాంగ్రెస్ పాలన - దేశానికే అరిష్టం


చంద్రబాబు తెలంగాణాలో అస్థిత్వంకోసం ప్రాకులాడటానికి కారణం ఓటుకునోటు, ఆపై ఆం.ప్ర.లో ఆయన పాలనా వైఫల్యమే. అలా ఐతే రాష్ట్రం లో అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేయవచ్చు కదా! అందుకే కనీసం తన చుట్టూ కాంగ్రెస్ తో వలయం నిర్మించుకొని ఆ అంతఃపురంలో బ్రతికి బట్తకట్టవచ్చనేది బాబు వ్యూహం కావచ్చు. దానికి ఆయన ఎంచుకున్నది ఆర్ధిక నేరగాడైన ఆంధ్ర ఆక్టోపస్ ని. అందుకే చిలకగా మారిన ఆక్టోపస్ పలుకులు చిలక జోస్యంలా ఉన్నాయని కడియం శ్రీహరి.  

Image result for Flags of parties contesting in telangana 2018

ఆంధ్రా ఆక్టోపస్ సర్వె ప్రకటన నిజాయతీగా లేదు. ఎప్పుడో ఎన్నికల తరవాత ప్రకటించాల్సింది - ఎన్నికలకు మూడురోజుల ముందు ప్రకటించటంలోనే అందులోని కుతంత్రం కనపడుతుండగా నెపధ్యంలోని కుట్రదారుడెవరో మనకు తెలియదా!

Image result for parties contesting in telangana 2018

మరింత సమాచారం తెలుసుకోండి: