Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 1:58 pm IST

Menu &Sections

Search

తెలంగాణ అభ్యర్థుల్లో ధనవంతులెవరు..? నేరచరితులెవరు..?

తెలంగాణ అభ్యర్థుల్లో ధనవంతులెవరు..? నేరచరితులెవరు..?
తెలంగాణ అభ్యర్థుల్లో ధనవంతులెవరు..? నేరచరితులెవరు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మరికొన్ని గంటల్లో తెలంగాణ తీర్పు చెప్పబోతోంది. 7వ తేదీ శుక్రవారం పోలింగ్ జరగబోతోంది.. ఈ నేపథ్యంలో ఓటరు ఓటు వేసే ముందు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎవరికి ఓటేస్తే బాగుంటుందనే అంశాన్ని ఓటరు మదిలో ఉంచుకోవాలి.. తన ఓటు దుర్వినియోగం కాకుండా మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి మద్దతు పలికే అవకాశం కలుగుతుంది. మరి ఎవరికి ఓటేయాలి.. ఎవరు మంచోళ్లు.. ఎవరు ధనవంతులు.. లాంటి అంశాలను ఓసారి పరిశీలిద్దాం..

telangan-elections-rich-persons-trs-tcongress-ttdp

తెలంగాణలో మొత్తం 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 83 శాతం మంది కోటీశ్వరులే కావడం విశేషం. అత్యధిక ఆస్తులు కలిగిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన ఆస్తి రూ.314.31 కోట్లు. వ్యాపారవేత్తగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరొందారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముత్యాల సునీల్ కుమార్ యువ వ్యాపారవేత్త. గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ తరపున బరిలో నిలిచారు. సునీల్ కుమార్ ఆస్తి రూ.182.66 కోట్లు. నాగర్ కర్నూలు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మర్రి జనార్ధన్ రెడ్డి ధనవంతుల్లో మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి రూ.161.29 కోట్లు.!

telangan-elections-rich-persons-trs-tcongress-ttdp

తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉన్న టాప్ టెన్ ధనవంతులు – వారి ఆస్తిని ఓసారి పరిశీలిద్దాం.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.314.31 కోట్లు (కాంగ్రెస్)
ముత్యాల సునీల్ కుమార్ రూ.182.66 (బీఎస్పీ)
మర్రి జనార్ధన్ రెడ్డి రూ. 161.29 (టీఆర్ఎస్)
కంభం అనిల్ కుమార్ రెడ్డి రూ. 152.33 (కాంగ్రెస్)
కుసుమకుమార్ రెడ్డి రూ.149.51 (స్వతంత్ర)
గజ్జల యోగానంద్ రూ.146.61 (బీజేపీ )
కాసాని జ్ఞానేశ్వర్ రూ. 131.57 (కాంగ్రెస్)
గడ్డం వినోద్ రూ. 131.37 (బీఎస్పీ)
ఆకుల శ్రీనివాసరావు రూ. 120.53 (ఎన్సీపీ)
నామా నాగేశ్వర రావు రూ.12.63 (టీడీపీ)


ఇక నేరచరితులను పరిశీలిస్తే.. మొత్తం 368 మందికి నేర చరిత్ర ఉంది. వీరిలో తీవ్రమైన నేరచరిత్ర.. అంటే మర్డర్లు, మానభంగాలు, దందాలు, దోపిడీలు.. లాంటివి..!! ఇలాంటి నేరాలు చేసినవాళ్లు 231 మంది ఉన్నారు. వీరిలో హత్యలతో సంబంధమున్నవారు 6గురు. హత్యాయత్నం కేసులున్నవారు 24 మంది, కిడ్నాప్ కేసులున్నవారు 4గురు, మహిళలపై దాడుల కేసులున్నవారు 21 మంది ఉన్నారు. 


పార్టీలవారీగా పోటీ చేసిన అభ్యర్థుల్లో నేరచరితులను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా 45 మంది నేరచరితులున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి 44 మంది బరిలో నిలిచారు. బీజేపీ నుంచి 26 మంది, బీఎస్పీ నుంచి 18 మంది నేరచరితులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.


telangan-elections-rich-persons-trs-tcongress-ttdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వాళ్లు పోటీ చేయట్లేదుగా... సో మేం గెలవడం ఖాయం..!! శివసేన వింత వాదన
పాక్ తో మళ్లీ శాంతి చర్చలు చేయ్యాల్సిందే! :కాంగ్రెస్
సెన్సేషన్ : చనిపోయేందుకు మాకు పర్మిషన్ ఇవ్వండి – 200 మంది గ్రూప్ 2 ఉద్యోగుల వినతి
కీలక నేతలు లేకుండానే ఎన్నికలు జరగొచ్చు..జగన్ వ్యాఖ్యల మర్మమేంటీ?
ఏది నిజం : అద్వానీని మోదీ-షా తప్పించారా..? ఆయనే తప్పుకున్నారా?
దిమ్మ తిరిగిపోయే డెసిషన్ తీసుకున్న మాయావతి!
కేరళలో బీజేపీకి కలిసొస్తున్న అంశమేంటో తెలుసా..?
అజహర్ తో ‘ఆట’ ఆడుకుంటున్న కాంగ్రెస్..!! జంపింగ్ ఖాయమా..?
లండన్ లో నీరవ్ మోదీ అరెస్ట్..! మరి భారత్ కు ఎప్పుడు..??
నవీన్ ను అడ్డుకునే మొనగాడెవ్వరు..?
బీజేపీ, కాంగ్రెస్ ఎంత తోపులైనా ప్రాంతీయ పార్టీల ముందు మోకరిల్లాల్సిందే..!
కన్నడనాట ‘సుమలత’ సంచలనం!
పాపం కమల్ హాసన్..! కొబ్బరికాయ కొట్టకముందే పార్టీలో ఝలక్ లు..!!
ప్రియాంక ‘గంగాయాత్ర’..! నానమ్మ బాట కలిసొచ్చేనా...?
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.