ఆంధ్రా ఆక్టోపస్, సర్వేల వీరుడు లగడపాటి రాజగోపాల్ విశ్వసనీయతని ఇపుడు తెలంగాణా ప్రజలు కాపాడుతారా. తన క్రెడిబిలిటీని సైతం పందెం ఒడ్డిన ఈ సర్వేల రాజగోపాలుడిని గెలిపించి పరువు నిలుపుతారా. ఓడించి పుట్టె ముంచుతారా. ఇది మరో నలభై ఎనిమిది గంటల్లో తేలిపోతుంది. తెలంగాణా రాకూడదని, వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని శపధం చేసి ఆ మాటకు కట్టుబడి ఇప్పటికి  ఒక ఎన్నికను లగడపాటి త్యాగం చేశారు. 


ఓడించి గెలిపించాలి :


తెలంగాణాకు కట్టుబడిన టీయారెస్ ని  ఓడించితేనే లగడపాటి గెలుస్తారు. తెలంగాణా తెచ్చుడో, చచ్చుడో అంటూ పద్నాలుగేళ్ళు వీర పోరాటం చేసిన కేసీయార్ పరువు తీస్తేనే లగడపాటి పరువు నిలిచేదిపుడు. ఎన్నికల్లో టీయారెస్ ఓడిపోతోందని ఈ రోజు మరింత క్లారిటీగా లగడపాటి మీడియాకు చెప్పేశారు. నిన్నటి సర్వేపై కేటీయార్ చేసిన కామెంట్స్, ట్విట్టర్లో పాత మెసేజులను పెట్టి చేసిన గలీజుతో లగడపాటికి ఉక్రోషం తన్నుకువచ్చిందేమో తెలియదు కానీ, వ‌రంగల్ కూడా కూటమిదేనంటూ ఈ రోజు మరికొంత సర్వే సమాచారం లీక్ చేశారు. 
ప్రజావ్యతిరేకత అండర్ కరెంట్ గా ఉందని, ఆ వాస్తవాలు చెప్పమంటారా అంటూ ఏకంగా కేటీయార్ కే సవాల్ చేశారు. ఈ పరిస్థితుల్లో లగడపాటి పూర్తి సర్వే ఏంటన్నది తెలిసిపోతోంది. కూటమి గెలుపు ఖాయమని ఆయన ఈ నెల‌ 7న సాయంత్రం చెప్పబోతున్నారు. అల ఛెప్ప‌కుండా ఉండాలంటే తెలంగాణా ఓటర్లు సర్వేను  ఉల్టా చేయాలి.అంటే టీయారెస్ ని గెలిపించాలి. 


అలా జరుగుతుందా :


అదే కనుక జరిగితే లగడపాటి సర్వేలపై  జనాలకు ఇంక విశ్వాసం ఉండదు కాక ఉండదు. మరి టీయారెస్ ని ఓడించి లగడపాటిని తెలంగాణా సమాజం గెలిపిస్తుందా. తెలంగాణా వద్దు అని పోరాటం చేసిన లగడపాటి కే ఓటు వేస్తుందా అన్నది ఇక్కడ ఇంటెరెస్టింగ్ పాయింట్. ఇక తెలంగాణా తెచ్చిన కేసీయార్ ని ఓడించడం ద్వారా అయిదేళ్ళ నాటి ఉద్యమ ఆవేశాన్ని చంపుకుంటుందా. ఇవన్నీ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ప్రశ్నలే. 
ఇపుడు క్లారిటీగా చెప్పాలంటే  బయటకు కేసీయార్, లగడపాటి ఓ వైపు కనిపిస్తూంటే వెనక తెలంగాణా కోరిన వారు, వద్దన్న వారు నిలిచి ఉన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణా తెచ్చిన కేసేయార్ కి పట్టం కట్టిన జనం ఇపుడు కాదనుకుంటే  కూటమి వస్తుంది. ఆ వెనకే లగడపాటికి విజయమూ వస్తుంది. మరి ఈ  సర్వే మతలబు  రట్టు కావాలంటే తెలంగాణా జనం తీర్పు చెప్పాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: