కేటీఆర్ తనకు లగటిపాటి రాజగోపాల్ రెడ్డి కి జరిగిన చాట్ ను బహిర్గతం చేశాడు. అయితే  తెలంగాణ ఉద్యమ సమయంలో 'తెలంగాణ ద్రోహి' అన్న ముద్రను బలంగా మోసిన వ్యక్తి లగడపాటి రాజగోపాల్‌. విజయవాడ కాంగ్రెస్‌ ఎంపీగా అప్పట్లో పనిచేసిన లగడపాటి రాజగోపాల్‌, తెలంగాణ రాష్ట్ర సమితితో పెట్టుకున్న జగడం అలాంటిలాంటిది కాదు. దాంతో ఆయన్ని తెలంగాణ ద్రోహిగా టీఆర్‌ఎస్‌ చిత్రీకరించింది.

Image result for ktr

తెలంగాణ వేరు, తెలంగాణ రాష్ట్ర సమితి వేరు.. అని చెప్పేందుకు లగడపాటి చాలా ప్రయత్నించారు.. విఫలమయ్యారు కూడా.! ఇక, అసలు విషయానికొస్తే.. లగడపాటి రాజగోపాల్‌కీ తనకూ మధ్య జరిగిన ఓ వాట్సాప్‌ ఛాట్‌ డిటెయిల్‌ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు అలియాస్‌ కేటీఆర్‌. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన 'సర్వే రిజల్ట్స్‌' తాలూకు వాట్సాప్‌ ఛాట్‌ అది. అందులో లగడపాటి ఏం చెప్పారు.? ఇప్పుడు లగడపాటి ఏం మాట్లాడుతున్నారు.? అన్నది వేరే చర్చ. కానీ, లగడపాటికీ - కేటీఆర్‌కీ మధ్య 'వాట్సాప్‌ చర్చ' జరిగేంత స్నేహం కొనసాగుతోందా.? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.

లగటిపాటి ఆ చిన్న లాజిక్ ఎలా మరిచి పోయాడు...!

రాజకీయం అంటేనే ఇంత.! లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణ సమాజం దృష్టిలో 'దోషిగా' నిలబడాలన్నది టీఆర్‌ఎస్‌ ఆకాంక్ష. ఆ దిశగానే అప్పట్లో రాజకీయాలు నడిచాయి. కానీ, వ్యక్తిగత సన్నిహిత సంబంధాల కథ వేరేలా వుంటుందనుకోవాలేమో.! అదే ఇప్పుడు బయటపడిందని అనుకోవాలి మనం. చంద్రబాబు, కేసీఆర్‌ నిర్వహించిన చండీయాగానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా రావొచ్చు.. కానీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయకూడదంతే. ఇదీ టీఆర్‌ఎస్‌ రాజ్యాంగం. లగడపాటి విషయంలోనూ అంతేనన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: