తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇదే క్రమంలో తెలంగాణ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండవలసి వచ్చింది అన్న విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు పవన్. పార్టీ క్యాడర్ మరియు సరైన సమయం లేకపోవడం వలన తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు.

Image may contain: 5 people, outdoor

తాజాగా ట్విట్టర్ ద్వారా ఎన్నికలపై స్పందించిన ఆయన తెలంగాణ అంటే తనకు ఎనలేని గౌరవం అంటూ మరోసారి పోటీ చేయకపోవడానికి గల కారణాన్ని వివరించి తెలంగాణ ప్రజలు 7న జరగబోయే ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలో వివరించారు.

Image may contain: 7 people, outdoor

ప్రస్తుతం తెలంగాణ జనాలు రాష్ట్రాన్ని తెచ్చామంటున్న, రాష్ట్రాన్ని ఇచ్చామంటున్న, రాష్ట్రాన్ని ఇప్పించామంటున్న పార్టీల నడుమ సందిగ్ధంలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితిలోనే వాళ్ళు లోతుగా ఆలోచించుకుని మంచి పారదర్శకత అందించగల, తక్కువ అవినీతితో ఎవరైతే పాలన చేయగలరో వారినే ఎంచుకుని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

Image may contain: 5 people, people smiling, people standing

తెలంగాణ సామాన్య ప్రజానీకానికి న్యాయం చేసే ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని..ఏ పార్టీ వస్తే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆ పార్టీని ఎంచుకోవాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు రాబోయే ప్రభుత్వం మంచి చేయాలని కోరుకున్నారు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి: