ఆంధ్రా ఆక్టోపస్ గా పాపులరైన మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలపై కెసియార్ లో బాగా ఉలిక్కిపాటు కనబడుతోంది.  కెసియార్ తో పాటు కొడుకు కెటియార్ మేనల్లుడు హరీష్ రావులు కూడా లగడాపాటి మీద ఎందుకు మండిపోతున్నారో అర్ధం కావటం లేదు. సర్వేలంటే నిజం కావటానికి ఎంత అవకాశం ఉందో కాకపోవటానికీ అంతే చాన్సుంది. ఆ విషయాలు కెసియార్ అండ్ కోకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయినా ఎందుకంత ఉలిక్కిపాటు ? ఎందుకంటే, లగడపాటి సర్వే వివరాలు ఎక్కడ నిజమైపోతుందో అన్న ఆందోళన ఎక్కువగా కనబడుతోంది. రేపటి ఎన్నికల్లో మహాకూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది లగడపాటి సర్వేలో వెల్లడైంది. అప్పటి నుండి లగడపాటి సర్వేపై అందరూ మండిపోతున్నారు.

 Image result for mahakutami images

తెలంగాణా ఎన్నికల ఫలితాల అంచనాలపై జాతీయ మీడియాలో చాలా వరకూ టిఆర్ఎస్ కే ఎడ్జ్ ఇచ్చాయి. అదే విషయాన్ని కెసియార్ చాలా బహిరంగ సభల్లో ప్రస్తావించారు కూడా. అన్ని సర్వేలు తనకు అనుకూలంగా వచ్చినపుడు ఆనందపడిపోయిన కెసియార్ ఒక్క లగడపాటి సర్వే మాత్రం తనకు వ్యతిరేకమయ్యేటప్పటికి ఎందుకంత ఆగమాగమైపోతున్నారు ? అంటే లగడపాటి సర్వేపై కెసియార్ అండ్ కో కు బాగా విశ్వాసం ఉన్నట్లుంది. గతంలో లగడపాటి వెల్లడించిన చాలా సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అందుకే ఇపుడు కూడా లగడపాటి సర్వే ఎక్కడ నిజమవుతుందేమో అన్న ఆందోళనే కనబడుతోంది.

Related image

జాతీయ మీడియాలు కూడా సర్వే చేసినపుడు కెసియార్ కు ఎడ్జ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మీడియాలు ఎక్కడ సర్వేలు చేసింది. ఎవరితో మాట్లాడింది, ఎప్పుడు సర్వేలు జరిపింది అన్న వివరాలు లేవు. పైగా జాతీయ మీడియాలు చేసిన సర్వేలన్నీ నిజాలయ్యేందుకు అవకాశాలు తక్కువే. ఎందుకంటే ప్రధానంగా భాష సమస్య. పైగా తెలంగాణా ప్రాంతంతో వాటికి పెద్దగా  పరిచయటం కూడా ఉండదు. అదే లగడపాటికి ఆ సమస్యలు లేవు. తెలంగాణాలో ఏమూలనైనా వెళ్ళి సర్వే చేయగలరు. పైగా తన సర్వేని 45  రోజుల పాటు నిర్వహించినట్లు చెప్పారు. ఆ సౌలభ్యం జాతీమ మీడియాలు నిర్వహించిన సర్వేల్లో అవకాశం తక్కువ. అందుకే లగడపాటి సర్వేలంటే కెసియార్ అండ్ కో ఉలిక్కిపడుతున్నాయి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: