అభివృద్ధి అవసరమైనప్పుడు చాలామంది నాయకులు రాజకీయవేత్తలగా మారి అలాగే మార్పు కోసం మళ్లీ నాయకులుగా మారుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగి ప్రజాబలంతో అధికార పార్టీ నుండి వైదొలిగినా కూడా విజయం వైపు దూసుకుపోతున్నారు. అవసరమైనప్పుడు ప్రజల కోసం తనదైన శైలిలో నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్న ఇతను ఇంత గొప్ప పేరును ఎలా గడించాడో తెలుసుకోవాల్సిందే.


అతని తాత గారి ఇంట్లో ఉన్నప్పుడే ఆయన 1960 లలో ఉద్యమకారుల వాతావరణం మధ్య పెరిగాడు. ఆ ఇల్లు ఎంతోమంది విద్యావేత్తలకు, లాయర్లకు, సంఘసంస్కర్తలకు, రైతులకు నెలవు. ఆ చోటు నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందనే చెప్పాలి. విదేశాల్లో పై చదువులు పూర్తి చేసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి వచ్చిన తర్వాత 2007లో మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తనకున్న అశేషమైన జ్ఞానసంపదతో అప్పట్లో శ్రీకృష్ణకమిటీకి ప్రత్యేక తెలంగాణ ఇస్తే ఎలా తాగునీరు, వ్యవసాయం, విద్య, ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగుపడతాయో క్షుణ్ణంగా వివరించారు.


ఇలా తెలంగాణ రాష్ట్ర లక్ష్యసాధనలో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించిన విశ్వేశ్వర్ రెడ్డికి కేసీఆర్ నుండి 2013లో రాజకీయ ఆహ్వానం లభించింది. ఎప్పుడు ప్రజల చెంతనే ఉంటూ ప్రజలతోనే నడుస్తూ ప్రజల కోసం పోరాడే కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014 ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
ఇలా ప్రజల తరఫున ఉంటూ ప్రజల కోసం మాట్లాడే అతని వ్యక్తిత్వమే చివరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే లేక వెన్ను చూపితే ఆయన మాత్రం ఎందుకు తగ్గకుండా ప్రజల తరఫున నిర్విరామంగా పోరాడారు.


చివరికి బంగారు తెలంగాణ లక్ష్యసాధన టిఆర్ఎస్ పార్టీ వల్ల జరగదు అని తేలి అధికార పార్టీ నుండి తొలగిపోవడానికి కూడా ఏ మాత్రం సంశయించలేదు. ప్రతిపక్షం లో చేరిన అతని నిర్ణయాన్ని ఎంతోమంది కొనియాడారు. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు ఇప్పుడు బంగారు తెలంగాణ లక్ష్యసాధన కావచ్చు ప్రజా నేతగా ఎప్పుడు న్యాయం వైపు నిలబడే అతని తత్వమే ఇప్పుడు అతని రాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన పాత్రధారిగా నిలబెట్టింది. ఇప్పుడు అతను కాంగ్రెస్ కు వెన్నుముక్కగా నిలిచి టిఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఈ నెల 7న జరగనున్న ఎన్నికల్లో గెలుపోటములకు ఉండే అంతరం కేవలం విశ్వేశ్వర్ రెడ్డే అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: