తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల మధ్య దాయాదిమత్సరం ముదిరిపోతుంది. కారణాలెన్నున్నా దానికి ప్రధాన కారణం ఇద్దరు రాష్ట్రల అధినేతల మద్య పెరిగిపోతున్న బద్ధవరమే. చంద్రబాబు క్లోరుకున్న పొత్తు ఆఫర్ ను కెసీఆర్ తిరస్కరించటం ఆయన భరించలేక పోతున్నారు. చంద్రబాబు ఎలాంటివాడో తనకు బాగా తెలుసుకాబట్టే కేసీఆర్ తిరస్కరించటానికి కారణం అంటున్నారు తెలంగాణా ప్రజలు. అయితే విబేధం విశాలమై ఇరు రాష్ట్రాల మద్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. అది ఎన్నికల విషయాల్లొ కూడా కనిపిస్తున్నాయి. 
Image result for Not Utilising AP Police in Telangana Elections EC  

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓటర్లను ప్రలోభ పెడుతు న్నారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని కూడా అనుకుంటోంది.

Image result for central police forces in Telangana elections
ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే పొరుగురాష్ట్రాల నుంచి పోలీసులను బందోబస్తుకు పిలిపించడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ను తెలంగాణలో బందోబస్తుకు పిలిపించ కూడదని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈ మధ్య మీడియాకు చెప్పారు.


జగిత్యాల జిల్లా ధర్మపురి లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారని టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ఎన్నికలసంఘం తెలంగాణలో ఎన్నికల సంఘం నిఘావర్గాల సంచారం, ఓటర్లను ప్రలోభ పెట్టడంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించింది.
Image result for central police forces in Telangana elections 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు బలగాలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించ కూడదని ఈసీ నిర్ణయించింది. ఇతర సరిహద్దు రాష్ట్రాల బలగాలను ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తామని, ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించమని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. అది కూడా తెలుగురాష్ట్రం కావడం వల్లే, అక్కడ ఇక్కడ వారికి ఎన్నో సంబంధ బాంధవ్య్హాలు ఉండటం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  తెలంగాణ ఎన్నికలకు 70 వేల మంది రాష్ట్ర పోలీసులతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి బలగాలను రప్పిస్తామని చెప్పారు. రెండు ఎయిర్‌ అంబులెన్స్‌ లు కావాలని కోరామని, ప్రస్తుతానికి ఒకదానికే అనుమతి లభించిందని, దీన్ని ఖమ్మంలో ఉంచుతామని తెలిపారు. 
 Image result for central police forces in Telangana elections

ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌ లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఇచ్చిన నోటీసుకు టీఆర్‌ఎస్‌ నుంచి సమాధానం రాలేదని రజత్‌కుమార్‌ తెలిపారు. ఆ పార్టీ నేతలకు ఎన్నికల నిబంధనలు తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్‌ ఫోన్‌-ట్యాపింగ్‌ చేయడం లేదని తెలంగాణ డీజీపి మహేందరరెడ్డి రజత్‌కుమార్‌కు వివరణఇచ్చారు. వాహనాల తనిఖీ లోనూ పక్షపాతం చూపడంలేదని చెప్పారు. 

Image result for central police forces in Telangana elections

మరింత సమాచారం తెలుసుకోండి: