తెలంగాణ రాష్ట్రం లోని 119 స్థానాల్లో కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గత్గ ఎన్నికల్లో కేపీ వివేకానంద్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి కే హన్మంతరెడ్డిపై గెలిచారు. కేపీ వివేకానంద్‌కు 114235 ఓట్లు రాగా, హన్మంతరెడ్డికి 75214 ఓట్లు వచ్చాయి. కేపీ వివేకానంద్ 39000 ఓట్ల ఆధిఖ్యతతో తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. 
Telangana Assembly elections 2018
ఈ 2018 ఎన్నికల బరిలో బిజెపి తరపున కాసాని వీరేష్, కాంగ్రెస్ నుండి కూనా శ్రీశైలం గౌడ్, టిఆరెస్ నుండి కెపి వివేకానంద్ బిఎస్పి నుండి కోరిమిళ్ళ సంజీవరెడ్డి ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గ జనాభా 495683 అక్షరాశ్యత 81.15% రాష్ట్ర సరాసరి అక్షరాశ్యత 66.46%. గతంలో టిడిపి టికెట్ పై గెలిచి ఇప్పుడు టీఆరెస్ తరపున పోటీలో దిగుతున్న ప్రస్తుత శాసనసభ్యుడు కెపి వివ్రేకానంద్ ఆస్తులు విలువ ₹ 5 కోట్లు అదీ 2014 ఎన్నికల ప్రకారం. 
Telangana Assembly Elections 2018: Key Facts About Quthbullapur Constituency
పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఈ సారి కూడా కెపి వివేకానంద్ మాత్రమే గెలుస్తారన్న ప్రచారం  ఉన్నా కాకపోతే ఈ సారి టిఆరెస్ టిక్కెట్ మీద. మరో వైపు కూన శ్రీశైలం గౌడ్ కూడా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు..ఈసారి కాంగ్రెస్ కి టిడిపి ఇతర పార్టీలో జోడీ కావడంతో ఆయన బలం కూడా బాగానే పెరిగిందని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం వీరి మద్య హోరాహోరి యుద్దం కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మారిన సమీ కరణాలు మారుతున్న పరిస్థితులు ఎలాంటి ప్రిడిక్షణ్ నిర్దారించి చెప్పేలాగా లేవు. అపై వస్తున్న సర్వేలలో నిజాయితీ కూడా లేదు. రేపు ఏడవ తేదీన జరగనున్న ఎన్నిక లు పదకొండున వెలువడనున్న పలితాల కోసం నిరీక్షించవలసిందే. 

Image result for kp vivekananda mla

మరింత సమాచారం తెలుసుకోండి: