రాజకీయాల్లో పరుగులే వేరు. బయట పరుగు పందేల కంటే ఇక్కడ జోరు ఎక్కువే. ఆ దూకుడు రేసుల్లో పాలుపంచుకునే వారికి కూడా రాదు. మరి ఎన్నికలు వచ్చేస్తున్నాయి. రాజకీయ నేతలకు మళ్ళీ జంపింగుల అవసరం పడింది. గోడ దూకుళ్ళు, లాంగ్ జంపులు ఇప్పటి నుంచే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు.


తెలంగాణాతోనే:


ఈ జంపింగు జఫాంగులు తమ చేతలను, తల రాతలను తెలంగాణా ఎన్నికలతోనే ముడేసుకున్నారు. అక్కడ స్థితిని, పరిస్థితిని అంచనా వేసుకుని సేఫ్ జోన్ లోకి దూకేయాలని డిసైడ్ అయిపోయారు. తెలంగాణాలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. వాటి రిజల్ట్ ఇపుడు తేలబోతోంది. ఆక్కడ ఈ జంట హిట్ అయినా. ఫట్ అయినా కూడా ఏపీలో జంపింగులు తప్పవంటున్నారు. దానికి కారణాలు కూడా వేరేగా ఉన్నాయి. 


గెలిస్తే సీటు రాదు :


అక్కడ టీడీపీ, కాంగ్రెస్ కూటమి గెలిస్తే ఇక్కడ ఏపీలో కూడా పొత్తు ఖాయం అవుతుంది. దాంతో ఇక్కడ పెద్ద మొత్తంలో సీట్లకు కోత పడుతుంది. అలా చూసుకున్నా ఆశావహులు రూట్ మార్చెసి తమ జాతకం తాము చూసుకుంటారు. ఒకవేళ అక్కడ పొత్తు  వికటించి టీయారెస్ అధికారంలోకి వస్తే అపుడు కూడా జంపింగులు భారీ స్థాయిలో ఉంటాయి. ఎలాగంటే టీడీపీ కూసాలు కదిలిపోయే స్థాయిలో అన్న మాట. అపుడు ప్రత్యర్ధి పార్టీలైన వైసీపీ, జనసేనల్లో వెంటనే వెళ్ళి కండువాలు మార్చేసుకుంటారు.  అందువల్ల ఏపీలో అధికార పార్టీ తమ్ముళ్లకు ఇపుడు తెలంగాణా ఎన్నికలు అతి కీలకంగా మారాయి.


వైసీపీలోనూ :


ఇక విపక్ష వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీలోనూ తెలంగాణా కలకలం బాగానే ఉంది అక్కడ టీడీపీ కాంగ్రెస్ కూటమి గెలిస్తే ఇక్కడ వైసీపీలో నిరాశ అలుముకోవడం ఖాయం. గెలుపు అవకాశాలు కొట్టిపారేయలేకపోయినా బాబు ఊపును పట్టలేమని వైసీపీ భావిస్తుందపుడు. ఆ విధంగా చూసుకున్నపుడు జగన్ పార్టీలో ఉంటూ టికెట్లు రావనుకున్న వారు, అసంత్రుప్తిగా ఉంటున్న నాయకులు కూడా కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంది. అయితే కొత్త పార్టీ జనసేనలో మాత్రం ఈ ఇబ్బంది లేదు. ఫలితాలు ఎలా వచ్చినా ఆ పార్టీకి ఏపీలో వచ్చేదే కానీ పోయేదీ ఏమీ ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: