దాదాపు 45 రోజులపాటు తెలంగాణాలో విస్తృతంగా తిరిగి ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్  చేసిన సర్వేలో కెసియార్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత కనిపించిందట. నాలుగున్నరేళ్ళల్లో తాను చేసిన అభివృద్ధే తనను మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తుందని మొదట్లో చెప్పిన కెసియార్ ఇఫుడామాట ఎక్కడా చెప్పటం లేదు. పైగా ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇఫుడు నానా అవస్తలు పడుతున్నారు. నిజంగానే తాను చెప్పుకున్నట్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే ఆధారపడలేదన్నది స్పష్టం. గెలుపుపై అనుమానంతోనే సెంటిమెంటును మళ్ళీ రాజేస్తున్నారు. చంద్రబాబునాయుడును అమ్మనాబూతులు తిట్టటం కూడా అందులో భాగమే.

 

ముందస్తు ఎన్నికల్లో కెసియార్ ఎందుకంత ఎదురీదుతున్నారు ? ఎందుకంటే, ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా బలంగా ఉందని కెసియార్ గ్రహించారని లగడపాటి చెబుతున్నారు. ఎన్నికల్లో పోరు హోదాహోరీగా ఉంటే ప్రభుత్వం, ఎంఎల్ఏలపై ఉన్న వ్యతిరేకత బలంగా బయటకు వచ్చేస్తుందని చెబుతున్నారు. ఇఫుడు జరిగింది అదేనట. ప్రభుత్వంపై జనాల్లో ఉన్న వ్యతిరేకతే ప్రతిపక్షాలకు బాగా కలిసి వస్తున్నట్లు లగడపాటి తేల్చేశారు. అదికూడా మహాకూటమి అభ్యర్ధులకే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని తాను అంచనా వేసినట్లు చెబుతున్నారు.

 

టిఆర్ఎస్ సిట్టింగ్ ఎంఎల్ఏలపై ఉన్న వ్యతిరేకత గడచిన 15 రోజులుగా మహాకూటమి అభ్యర్ధులతో పాటు ఇతర అభ్యర్ధులవైపే పోలరైజ్ అవుతున్నట్లు లగడపాటి అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఆధిక్యంలో ఉండాలి కానీ నువ్వా నేనా అనే పరిస్దితిలోకి వచ్చేస్తే ప్రతిపక్షాలకే లాభం జరుగుతుందని లగడపాటి జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్, చంద్రబాబు, సిపిఐ, టిజెఎస్ కలిసిన తర్వాత అధికార పార్టీలోని ఎంఎల్ఏల్లో నెగిటివ్ చూడటం మొదలుపెట్టారట.

 

దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వకపోవటంతో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీలంతా వ్యతిరేకమైపోయారట. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడినే సిఎం చేస్తానన్న కెసియార్ హామీని కూడా ఎస్సీలకు గుర్తుండిపోయిందట. డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు గ్రామాల్లో ఇచ్చి పట్టణాల్లో ఇవ్వకపోవటంతో అర్బన్ ప్రాంతాల జనాలు మండుతున్నారట. అలాగే, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మాట తప్పటం కూడా కెసియార్ కు ఇబ్బందిగా మారిందట.  దానికితోడు మహాకూటమి ఇఛ్చిన హామీలు, ప్రధానంగా చంద్రబాబు, కాంగ్రెస్ కలవటమే కెసియార్ కు చేటు తెస్తోందని లగడపాటి జోస్యం చెప్పారు.


అదే సమయంలో దాదాపు వందమంది అభ్యర్ధిలకు తిరిగి టిక్కెట్లు ఇవ్వటం కూడా టిఆర్ఎస్ కు బాగా మైనస్ అయినట్లే కనబడుతోంది. నాలుగున్నరేళ్ళల్లో చాలామంది ఎంఎల్ఏలపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ సమాచారం. ఎప్పటికప్పుడు కెసియార్ కు అందుతున్న ఏమాత్రం లెక్క చేయలేదు. పైగా ఎంఎల్ఏలను చూసి కాదని తనను చూసే ఓట్లు వేస్తారంటూ బహిరంగంగానే ప్రకటించారు. దాంతో సిట్టింగులపై నియోజకవర్గాల్లో గొడవలు పెరిగిపోయాయి. దాని ప్రభావం ఇఫుడు ప్రచారంలో కనిపిస్తోంది. రేపటి రోజున పోలింగ్ ఎలా జరుగుతుందో చూడాలి. లగడపాటి జోస్యం ఎంత వరకూ నిజమవుతుందో మరో రోజులో తెలిసిపోతుంది కదా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: