రాజకీయ నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ఆంగ్ సాన్ సూచీ ని 2009లో ఆమ్నెస్టీ సంస్థ  'అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్‌’ పురస్కారంతో గౌరవించింది.  ఒకప్పుడు సూచీని ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా ఆమ్నెస్టీ చూసింది. ఈ కారణం తో ఆమెకు పురస్కారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే  మియన్మార్ ప్రభుత్వ అధినేత ఆంగ్ సాన్ సూచీకి ఇచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారం 'అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్‌'ను వెనక్కి తీసుకుంటున్నట్లు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్  ప్రకటించిన విషయం తెలిసిందే. 

Image result for aung san suu kyi award amnesty international

దానికి కారణం మియన్మార్‌లో రోహింజ్యా సంక్షోభం గురించి ఆమె మాట్లాడకపోవడం విస్మయం కలిగించిందని ఆమ్నెస్టీ తెలిపింది.  మియన్మార్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా దాదాపు 7 లక్షల మంది రోహింజ్యాలు దేశ సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌కు వెళ్లారు.  మీరు మానవ హక్కులను పరిరక్షిస్తారని, విశ్వాసానికి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తారన్న నమ్మకం మాకు ఇకలేదు  అంటూ ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ కుమి నాయుడూ సూచీకి ఓ లేఖ రాశారు. 

Image result for aung san suu kyi award amnesty international

మియన్మార్‌లో సైనిక చర్యల తీవ్రతను బట్టి చూస్తే.. ఈ నిర్ణయాలను ఉన్నత స్థాయిలో తీసుకుని ఉండొచ్చని స్పష్టమవుతోందని ఆయన అన్నారు.  రఖైన్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా ఆమె స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆమ్నెస్టీ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం 'అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్‌'. నెల్సన్ మండేలా తర్వాత ఈ బహుమతి అందుకున్న వ్యక్తి ఆంగ్ సాన్ సూచీనే.



మరింత సమాచారం తెలుసుకోండి: