సినీనటుడు మోహన్ బాబు ముక్కు సూటి మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. తేడా వస్తే ఎవరు అన్నది కూడా చూడరు. కులం, మతం, ప్రాంతం లెక్కలేసుకుని గిరి గీసుకుని మాట్లాడడం మోహన్ బాబు కు తెలియదు అంటారు. మరి కీలకమైన తెలంగాణా ఎన్నికల విషయంలో మోహన్ బాబు ఏ వైపున ఉన్నారు. ఎలా స్పందించారన్నది ఆసక్తికరమే. 


టీయారెస్ కి జై :


తెలంగాణాను కేసీయార్ సాధించారని, ఆయన అద్భుతమైన పాలనను అందించారని మోహన్ బాబు చెబుతున్నారు. తెలంగాణాలో కేసీయార్ నాయకత్వంలో పాలన బాగా సాగుతోందని కూడా ప్రశంసించారు. తెలంగాణాకు కాపాడుకోవాలన్నా, ఈ అభివ్రుధ్ధిని కంటిన్యూ చేయాలన్నా కేసీయార్ నే ఎన్నుకోవాలని మోహన్ బాబు చెబుతున్నారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణాలో కులం జబ్బు లేదని, ఎవరు ఆ దిశగా ప్రేరేపించినా జనం మాత్రం లొంగరని మోహన్ బాబు అన్నారు.


పధకాలు బేష్ :


ఇపుడు తెలంగాణాలో ప్రజలకు మంచి పధకాలు అమలు అవుతున్నాయని, అందువల్ల ప్రజలు కూడా  ఆ దిశగా ఆలొచిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. పైగా చంద్రబాబుకు సన్నిహిత బంధువు. మరి ఆయన ఇపుడు టీయారెస్ కి అనుకూలంగా మాట్లాడడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఇక, కేసీయార్ అంటే ఒకపుడు మోహన్ బాబు కూడా వ్యతిరేకించేవారు. ఉద్యమ సమయంలో నేరుగా మాటల తూటాలే పేలాయి. అటువంటిది మోహన్ బాబు ఇలా కేసీయార్ పట్ల సానుకూల వైఖరితో ఉండడం నిజంగా ఆలొచించాల్సిన విషయమేనని అంటున్నారు.
 ఏపీ జనంలో కేసీయార్ పట్ల అభిమానం మెండుగా నిండుగా ఉందని, దానికి కళాకారులు కూడా అతీతులు కారని మోహన్ బాబు వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది. మొత్తానికి ఓ వైపు లగడపాటి వారి సర్వేలు కేసీయార్ పట్ల అంతటా వ్యతిరేకత ఉందని చెబుతూంటే సినిమా వారు, ప్రముఖులు సైతం ఆయన్ని మెచ్చుకోవడం చూస్తూంటే ఫలితాలపై ఆసక్తి పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: