తెలంగాణ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కూతురు భరిలోకి దిగటం తో అందరి కళ్ళు కూకట్ పల్లి నియోజక వర్గం వైపు చేరాయి . అయితే సుహాసిని ఇప్పడూ ఈసీ కు పిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.  పోలీసుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 

kukatpally tdp candidate suhasini compiant  to ec, against trs and police

తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్రను వెంటనే బదిలీ చేయాలని కోరారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్, ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని సుహాసిని ఈసీని కోరారు. 
Image result for suhasini harikrishna daughter
అయితే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రేపు(శుక్రవారం) పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార తెరాస, ప్రజాకూటమి హోరాహోరీగా ప్రచారం సాగించాయి. విజయంపై ఎవరికి వారు ధీమాగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈసీ ఎన్నికలు సజావుగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: