మినీ భారత యుద్ధానికి తెరలేచింది. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు దేశ పౌరులందరూ ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం మనకు కల్పించిన ఆయుధం – ఓటు..!! ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు కచ్చితంగా దేశానికి మేలు జరుగుతుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Image result for telangana voting

ఓటు వజ్రాయుధం.. కుల మత ప్రాంత భాషా బేధాలతో సంబంధం లేకుండా 18 ఏళ్లు నిండినవారందరికీ రాజ్యాంగం ఓటుహక్కు కల్పిస్తోంది. ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు దాఖలైంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. పార్టీలు, నేతల జాతకాలను మార్చే సత్తా ఒక్క ఓటుకు మాత్రమే ఉంది. ఇది ఇప్పటికే నిరూపతమైన నగ్న సత్యం. అయితే ఇప్పటికీ ఎంతోమంది ఓటు హక్కు వినియోగించుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గడచిన ఎన్నికలను ఓసారి పరిశీలిస్తే సరాసరిన 70 శాతం ఓటింగ్ మాత్రమే నమోదవుతోంది. ఈ విషయంలో అర్బన్ ఓటర్లతో పోల్చితే గ్రామీణులే ఎంతో బెటర్.. పట్టణ, నగర ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ పరిస్థితి మారాలి..

Image result for telangana voting

ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది.. ప్రచారం చేస్తోంది.. ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని పాటిస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా ఓటర్లలో మార్పు రావట్లేదు. ఓటు వేయడం కనీస బాధ్యత అనే విషయాన్ని మర్చిపోతున్నారు. దీంతో అసమర్థ పాలకులు ఎన్నికవుతున్నారు. వారిని ఐదేళ్లూ భరించాల్సి వస్తోంది. అందుకే ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రతి ఒక్క ఓటరూ వినియోగించుకుంటే తప్పకుండా మంచి పాలకులను ఎన్నుకునేందుకు అవకాశం లభిస్తుంది. 

Related image

పోలింగ్ జరిగే రోజు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తోంది. అయినా ఓటు వేయడానికి పది నిమిషాల సమయం కేటాయించలేకపోతున్నారు. ఇంటికే పరిమితమైపోతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓటుహక్కుపై విస్తృతస్తాయి చర్చ జరుగుతోంది. అయినా పెద్ద మార్పు కలగట్లేదు. ఓటర్లందరూ పోలింగ్ బూత్ బాట పట్టడం ద్వారా మార్పు సాధ్యమవుతుంది. ఓటు హక్కును గౌరవంగా భావించాలి. కానీ దాన్ని గుర్తింపు కార్డుకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దీంతో దేశం చాలా నష్టపోతోంది.


ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్థులు కాకపోవడం, నేర చరిత్రులు కావడం ఓటర్లకు విసుగు తెప్పిస్తోంది. అందుకే ఓటింగ్ కు రావడానికి ఎడ్యుకేటర్లు ముందుకు రావడంలేదు. పనికిమాలిన నాయకులకు ఓటు వేసి గెలిపించడం కంటే విలువైన ఓటును ఎవరికీ వేయక పోవడమే మేలనే పీలింగ్ వాళ్లలో కనిపిస్తోంది. ఇలాంటి వాళ్లకోసమే నోటా వెసులుబాటు ఉంది. అయితే దానికి విలువ లేనప్పుడు దానికి కూడా వేయడం వేస్ట్ అనేది విద్యావంతుల మాట. 
అయితే ఓటు విలువను తక్కువగా అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఓటు విలువ తెలియనవాళ్లే ఇలా భావిస్తుంటారు. ఒక్క ఓటు ఎందరో జీవితాలను తారుమారు చేసిన చరిత్ర ఉంది. ఒక్క ఓటుతో ఓడిపోయినవాళ్లు, ఒక్క ఓటుతో గెలిచిన వాళ్లు ఉన్నారు. అందుకే ప్రతి ఓటూ విలువైనదే..! ఏమో.. అది మీ ఓటే కావచ్చేమో..!! అందుకే ఓటును వినియోగించుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: