ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు యాంటీ వైరస్ కనుగొన్నారు..కానీ హెచ్ ఐవికి మాత్రం ఇప్పటి వరకు మెడిసన్ కనుగొనలేక పోతున్నారు.  హెచ్ ఐవికి నివారణ ఒక్కటే మార్గం..వ్యాధి రాకుండా జాగ్రత పడండి అంటూ సూచనలు ఇస్తుంటారు డాక్లర్లు. తాజాగా కర్ణాటకలోని హుబ్లి జిల్లా మొరాబ్ గ్రామంలో 23 ఎకరాల చెరువులోని నీటినంతా తోడేశారు. వివరాల్లోకి వెళితే..నవంబర్ 29న ఆ చెరువులో హెచ్ఐవీ సోకిన ఓ మహిళ (27) మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. అప్పటికే ఆ మృతదేహాన్ని చేపలు కొరుక్కొని తిన్నాయి. 

ఇది గమనించిన గ్రామస్థులు గుండెల్లో రాయిపడినంత పనైంది. దానికి కారణంగా ఆ చెరువుపై ఆదారపడి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మంచినీటి కోసం ఆ గ్రామస్తులంతా ఆ చెరువుపైనే ఆధారపడి ఉన్నారు. దీంతో, ఆ నీటిని వినియోగించడానికి గ్రామస్తులు నిరాకరించారు. నీరు మొత్తం హెచ్ఐవీ వైరస్ తో కలుషితం అయిపోయిందనే భయాందోళనలతో వారు ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని వైద్యాధికారులు అక్కడకు చేరుకొని నీటి శాంపిల్ తీసుకు వెళ్లి పరీక్షిస్తామని చెప్పారు..కానీ గ్రామస్థులు మాత్రం ససేమిరా అన్నారు. 

దాదాపు వెయ్యి మంది గ్రామస్తులు ఎనిమిది వాటర్ ట్యాంకులతో చెరువు వద్దకు చేరుకున్నారు చెరువు నీటిని నాలుగు మోటార్లతో 20 ట్యూబుల సాయంతో ఖాళీ చేయించారు. చెరువును నీటిని ఖాళీ చేయించామని.. చెరువును శుభ్రం చేసిన తర్వాత మాలాప్రభ కెనాల్ ద్వారా మళ్లీ నీటిని నింపుతామని స్థానిక తహసీల్దార్ చెప్పారు. అయితే  ఈ విషయంపై  రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ, గ్రామస్తుల భయానికి ఎలాంటి శాస్త్రీయత లేదని చెప్పారు. 

25 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు... నీటిలో ఎనిమిది గంటలకు మించి వైరస్ బతకదని స్పష్టం చేశారు. ఈ విషయం తెలియకుండా  గ్రామంలో 23 ఎకరాల చెరువులోని నీటినంతా తోడేశారని ఆయన అన్నారు.  ఏది ఏమైనా మనిషి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిస్తే ఎవరైనా ఇలాగే చేస్తారని గ్రామస్థులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: