చంద్రబాబు చాలా తెలివైనవారు. వారి సామాజిక వర్గం వారు ఆయన్ని ఏకంగా అపర చాణక్యుడు అంటారు. అయితే కొందరి అభిప్రాయం ప్రకారం సర్వేల ప్రకారం జరుగు తున్న పరిణామాలను బట్టి పొరపాటున తెలంగాణ రాజకీయంలోకి వేలెట్టాడేమో ననిపిస్తుంది. అంతా తన చుట్టూరానే తిరుగుతోంది, తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షణ్ అను కోవటమే కాదు దేశమంతా తానే చక్రం తిప్పుతున్నాను అని చెప్పుకోవడం చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం.

Image result for chandrababu eye on telangana

అయితే తనను తన పొత్తు ఆఫర్ ను కాదన్న టిఆరెస్ అధినేతలకు గుణపాఠం చెప్పాలనేమో తెలంగాణ రాజకీయాల్లోకి దూకారు. దూకేదోమో పూర్తిగా దూకకుండా 2014 ఎన్నికల్లో తను గెలిచిన సీట్ల కంటే తక్కువ సీట్లకు అభ్యర్ధులను పోటీకి నిలిపింది టీడీపీ. అయితే ప్రత్యక్షంగా ధమ్ములేక కాంగ్రెస్ ను ముందుపెట్టి షీల్డ్ వెనుక తాను నిలిచి పెద్ద రిస్క్ లేకుండా చూసుకొని - అంతా తనే నడిపిస్తున్నానే భ్రమలో తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. అంతేకాదు ఉన్నతవర్గాల ప్రకారం మొత్తం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తనను షీల్డ్ చేస్తూ ముందు నిలబడినందుకు తనకు కొన్నిస్థానా లు  ఇస్తే చాలన్న ఒప్పందం దానికి సహకరించిన కాంగ్రెస్ కు పరిహారంగా ₹5000 కోట్లు నజరానా గా సమర్పించు కుంటున్నారు అన్నది సమాచారం. ఇప్పటికే ₹1200 కోట్లు తెలంగాణా ఎన్నికల కు ఖర్చైపోయిందన్న వార్తలు గుప్పుమన్నాయి. 

Image result for chandrababu eye on telangana

ఒకవేళ తెలంగాణలో ప్రజాకూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడుకు మంచిదే. అయితే ప్రజా కూటమికి అంతగా అవకాశాలు కనిపించడం లేదని కొందరు, లేదు లేదు అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమేనని మరికొందరు చర్చోపచర్చలు జరుపుతున్నాయి , బెట్టింగులు కూడా జోరందు కున్నాయి. మళ్లీ తెరాసనే వస్తుందనే మాట బలం గానే వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో గనుక ప్రజాకూటమి ఓడితే ఆంధ్రప్రదేశ్ లో తారస్థాయిలో చంద్రబాబుకు & టీడీపీకి నక్షత్రాలు కనిపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

Image result for chandrababu eye on telangana

చంద్రబాబు తెలంగాణ ప్రచారంలో ప్రజాకూటమి, నిర్మాత నిర్వహణ అంతా తనే అనే భ్రమ ను కలిగేలా ప్రవర్తించారు. అయితే ఇప్పుడు ఓడిపోతే చంద్రబాబును ప్రజలు తిరస్కరిం చారనే అభిప్రాయం కలుగుతుంది. హైదరాబాద్ ను తనే ప్రపంచపటంలో పెట్టానని, సైబరాబాద్ ను తనే నిర్మించానని, తెలంగాణను అంతా తనే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకున్న తీరు కొంత అభ్యంతరకరంగా వినిపించింది. అయితే ఐటి కి స్పెల్లింగ్ కూడా తన బావ చంద్రబాబు హైదరాబాద్ వాసులకు ఉద్యోగు లందరి నేర్పాడని బామ్మర్ది నందమూరి బాలకృష్ణ కూడా తన ఉపన్యాసంలో దంచేశారు. అది కూడా వివాదాస్పధమైంది.

Image result for chandrababu eye on telangana

ఈ ప్రచార పటాటోపం చూసిన ప్రజలు ఒకవేళ ప్రజాకూటమి కనుక అధికారంలోకి రాకపోతే చంద్రబాబు మాటలన్ని ఉత్తర కుమార ప్రగల్బాలే అని ప్రజలు నిశ్చయం చేసేసుకుంటారన్నది యధార్ధం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆత్మస్తుతి ఆత్మసుత్తిగా జనాలు పట్టించుకో లేదని స్పష్టం అవుతుంది. తెలంగాణ ఎన్నికల ప్రభావం త్వరలో జరిగే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఖచ్చితంగా ప్రభావం చూపించగల అవకాశం తీవ్రంగా ఉంది. ఇప్పటికే తెలంగాణా టీడీపీకి వీడటానికి సిద్ధమైన నేతలు తెలంగాణ ఎన్నికల ఫలితాలను గమనించి ఆపై బయటకు వెళ్దామని అనుకుంటున్నారని సమాచారం.

 Image result for chandrababu eye on telangana

మరింత సమాచారం తెలుసుకోండి: